NTR-Charan duo spotted at Airport | ఎయిర్ పోర్ట్ లో చెర్రీ-తారక్.. ఏం జరుగుతోంది?

Ram charan tarak ready for shoot

NTR, Ram Charan, SS Rajamouli, Multi-Starrer, NTR-Ram Charan, NTR Tarak Airport, NTR Tarak Upasana

NTR Ram Charan Spotted at Airport. Photos Viral in Social Media. Amid SS Rajamouli Multi-Starrer, They Both Caught at Airport. News Surrounded that They Both Make A Photo Shoot There.

ఎయిర్ పోర్ట్ లో చెర్రీ-తారక్.. ఫోటోలు వైరల్

Posted: 03/07/2018 01:24 PM IST
Ram charan tarak ready for shoot

టాలీవుడ్ ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలే హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్-చరణ్ చెరో బ్యాగ్ పట్టుకుని ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. దాంతో ఇద్దరూ ఒకే చోటుకు వెళుతున్నారనే విషయం చూసేవారికి అర్థమైపోయింది.

ఈ ఇద్దరూ కలిసి అమెరికాకు వెళ్తున్నారన్నది దాని సారాంశం. అది కూడా రాజమౌళి సినిమా కోసమనే టాక్. ఫోటోల్లో పక్కనే చెర్రీ వైఫ్ ఉపాసనను కూడా చూడొచ్చు. వీళ్లిద్దరూ దర్శకధీరుడు రాజమౌళితో ఒక మల్టీ స్టారర్ చేయనున్నారు. ఆ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ ను కూడా ఆయన నిర్వహించనున్నట్టు వార్తలు వచ్చాయి.

అందులో భాగంగానే వీళ్లిద్దరూ అమెరికాకు వెళ్తున్నారంట. అక్కడే ఈ ఇద్దరు స్టార్ హీరోలపై ఓ ఫోటో షూట్ చేసి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమా ఎనౌన్స్ మెంట్ సమయంలో ఈ ఫోటోలను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఫోటోలపై స్పష్టత రావాల్సి ఉంది.  అంత అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ నుంచి ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టు మొదలు కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles