Powerful Title Consider for Varun Tej Next | స్పేస్ థ్రిల్లర్ కోసం మోస్ట్ పవర్ ఫుల్ టైటిల్

Aham brahmasmi for varun tej

Varun Tej, Aham Brahmasmi, Space Thriller, Director Sankalp Reddy, Sankalp Reddy Varun Tej, Telugu Space Thriller

Powerful Title consider for Actor Varun Tej's Space Thriller. Aham Brahmasmi title fix for Sankalp Reddy's Directorial Venture.

వరుణ్ తేజ్ ‘అహం బ్రహ్మాస్మి’?

Posted: 02/19/2018 03:10 PM IST
Aham brahmasmi for varun tej

సరైన హిట్లు లేవనుకుంటున్న టైమ్ లో ఫిదా, తొలి ప్రేమలతో బ్లాక్ బస్టర్లు కొట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తర్వాతి ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. లవ్ స్టోరీ జోనర్ లనే నమ్ముకోకుండా వైవిధ్యమైన కథల వైపు మళ్లీ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ క్రమంలో ఘాజీ దర్శకుడు సంకల్ఫ్ రెడ్డితో ఓ ప్రాజెక్టును ఓకే చేసిన విషయం తెలిసిందే. అంతరిక్ష నేపథ్యంతో ఈ కథ ఉండబోతుందని చెప్పుకున్నాం కూడా. ఒక్క పాట కూడా లేకుండా కేవలం పాత్రలతోనే ఈ చిత్రాన్ని నాటకీయంగా నడిపేందుకు సంకల్ప్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు.

అయితే ఈ చిత్రానికి ఇప్పుడు టైటిల్ కూడా ఫిక్స్ చేసేసినట్లు తెలుస్తోంది. అహం బ్రహ్మాస్మి అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిని అధికారికంగా ప్రకటించబోతున్నారంట. మే నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh