బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ గురించి బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు మరోవార్త హల్ చల్ చేస్తోంది. రెమ్యునరేష్ పిచ్చితో ఆమె అందివస్తున్న అవకాశాలను జేజార్చుకుంటుందని వరుసగా కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా చాలా కాలం తర్వాత భర్త అభిషేక్ తో నటించే అవకాశం దక్కినా ఆమె వదలుకుందని ఓ వార్త బాగా చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళ్తే... తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలసి నటించే అవకాశం ఆమెకు వచ్చిందంట. కథను విన్న వెంటనే ఆ సినిమాలో నటించేందుకు భార్యాభర్తలు ఇద్దరూ ఓకే చెప్పారట. అయితే, కథలో చిన్నపాటి మార్పులు చేయాలంటూ ఐశ్వర్య సూచించిందట. ఐష్ కోరిన విధంగానే సదరు దర్శకుడు కథలో మార్పులు చేసి తీసుకెళ్లాడట. అయితే, ఇప్పుడు ఆమె ప్లేట్ ఫిరాయించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా చేయలేనని, మరో సినిమా కోసం రూ. 10 కోట్లు తీసుకున్నానని ఐష్ చెప్పిందట. కథ మారిస్తే తన సినిమా చేస్తానని చెప్పారు కదా అని దర్శకుడు అడిగితే... పది కోట్లు ఇస్తుంటే సినిమాను ఎలా వదులుకుంటానని ఆమె బదులు ఇచ్చిందంట. కావాలంటే ఈ సినిమా పూర్తయిన తర్వాత మీ సినిమా చేస్తానని చెప్పటంతో చేసేది లేక దర్శకుడు వెనుదిరిగినట్లు తెలుస్తోంది. భర్తతో కలసి నటించే అవకాశం లేకలేక వస్తే... డబ్బు పిచ్చితో ఆమె ఆ అవకాశాన్ని వదిలేసుకుందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Feb 27 | ప్రముఖ హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కలిసి నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అల్లరి రవి బాబు, రవి ప్రకాష్, సూర్నారాయణ... Read more
Feb 27 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన హిట్ టాక్ ను సోంతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.8 కోట్ట బడ్జెట్ తో రూపోందించాలని భావించిన ఈ చిత్రం ఏకంగా రూ.22... Read more
Feb 27 | రీల్ లైప్ లో ప్రేమ, పెళ్లి అంటూ ప్రతీ చిత్రంలో పరుగులు తీసి.. రోమాంటిక్ హీరోలా తెలుగు ప్రేక్షకులు హృదయాలను కొల్లగొట్టిన హీరో నితిన్.. రియల్ లైఫ్ లోనూ తన బాల్య స్నేహితురాలినే పెళ్లి... Read more
Feb 27 | నవ్వుల కిరీటీ రాజేంద్రప్రసాద్, యువ నటుడు శ్రీ విష్ణు కలసి నటిస్తున్న క్రైమ్ ధ్రిల్లర్ ‘గాలి సంపత్’ చిత్రం దర్శకుడు అనీష్ కృష్ణ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా ట్రైలర్... Read more
Feb 27 | ఏంజెల్ ఆర్నాగా ప్రతిరోజు పండగే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి మార్కులు వేసుకున్న అందాల కథానాయిక రాశిఖన్నా తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో రోమాన్స్ చేస్తోందన్న వార్త ఇప్పుడు హాట్... Read more