Manchu Vishnu Plans for Highest Budget Movie | హాలీవుడ్ డైరెక్టర్ తోనే భక్త కన్నప్ప?

Manchu vishnu movie on bhakta kannappa

Manchu Vishnu, Bhakta Kannappa, Manchu Vishnu Big Budget Movie, Kannappa Manchu Vishnu

Manchu Vishnu Plans for Bhakta Kannappa Movie with 70 Crores Budget. Hollywood director may deal this project while hollywood technicians also take a part.

70 కోట్లతో మంచు విష్ణు భక్త కన్నప్ప

Posted: 02/06/2018 06:12 PM IST
Manchu vishnu movie on bhakta kannappa

కృష్ణంరాజు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'భక్త కన్నప్ప' ఒకటి. ఆయన సొంత బ్యానర్లో .. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, అప్పట్లో ఘనవిజయాన్ని సాధించింది. సత్యం అందించిన సంగీతం ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలిపింది. అదే 'భక్త కన్నప్ప' కథను ఈనాటి సాంకేతిక నైపుణ్యంతో రూపొందించనున్నట్టు కొంతకాలం క్రితం మంచు విష్ణు చెప్పాడు.

ఆయన కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాకు .. కథను తనికెళ్ల భరణి అందించారు. ఆ తరువాత ఎక్కడా ఈ ప్రస్తావన లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాకి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నాడని తాజాగా విష్ణు చెప్పాడు. దాదాపు 70 కోట్ల ఖర్చుతో ఈ సినిమాను నిర్మించనున్నామని అన్నాడు.

ముందు ఈ చిత్రాన్ని తనికెళ్ల భరణినే డైరెక్ట్ చేద్దామని అనుకున్నాడు. కానీ, భరణి నుంచి మంచి రేటుకు కొనుగోలు చేసిన విష్ణు ఓ హాలీవుడ్ డైరెక్టర్ ను రంగంలోకి దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు పెద్ద ఎత్తున్న హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా తీసుకోబోతున్నాడంట. అధికారిక వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని విష్ణు వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh