Nani Awe Release Date Announced | అ! రిలీజ్ డేట్.. వెరైటీగానే...

Awe release date

Awe Movie, Awe Release Date, Nani, Nithya Menon, Kajal, Awe Movie Release Date, Ravi Teja Awe Movie, Awe Movie Promotions

Awe Telugu Movie Release Date Officially announced. Awe release on February 16th. Prasanth Varma Direct debut with Awe while Nani Produce this movie. Nithya Menon, Kajal, Regina, Avasarala Srinivas, Murali Sharma and Isha Rebba starrer in this movie. Nani Ravi Teja Voice over special attraction in this movie.

అ! అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించేశారు

Posted: 01/29/2018 06:34 PM IST
Awe release date

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'అ' సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ కి .. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ముందుగా ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, తీవ్ర పోటీ ఉండటంతో ఈ సినిమాను వచ్చేనెల 2వ తేదీన విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఎట్టకేలకు ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చేశారు. ఫిబ్రవరి 16వ తేదీకి ఫిక్స్ చేశారు. అందుకు సంబంధించిన వెరైటీ పోస్టర్ ను వదిలారు. "అన్ని సినిమాలందు 'అ' సినిమా వేరయా .. విశ్వదాభి రామా ఫిబ్రవరి 16 రిలీజ్ రా మామా" అంటూ తాళపత్రాల రూపంలో కొత్తగా పోస్టర్ ను రిలీజ్ చేశారు.

విభిన్నమైన కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో, చేప పాత్రకు నాని .. చెట్టు పాత్రకు రవితేజ వాయిస్ ఇవ్వడం విశేషం. ఈ సినిమాతో నిర్మాతగానూ నాని సక్సెస్ ను అందుకుంటాడేమో చూడాలి. కాజల్ .. రెజీనా .. నిత్యామీనన్ .. ఈషా రెబ్బా .. అవసరాల .. మురళీ శర్మ .. ప్రధానమైన పాత్రలను పోషించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Awe Movie  Release Date  అ చిత్రం  విడుదల తేదీ  

Other Articles