Deepika Rare Record with Padmaavat Century Club | ఎట్టకేలకు ఆ ఫీట్ సాధించిన పద్మావత్.. దీపిక ఖాతాలో రేర్ రికార్డు

Padmaavat first weekend collections

Padmaavat, Padmaavat Weekend Collections, Padmaavat Collections, Padmaavat Taran Adarsh, Deepika Padukone, Malaysia Padmaavat

Padmaavat Star Deepika Padukone Is Queen Of 100 Crore Club. Padmaavat has conquered the box office and has made Deepika the "disputed Queen of Rs. 100 crore club". If more proof that Deepika Padukone rocks at the box office was needed, it is this - the Rs. 114 crore that "Padmaavat" has made in four days seals her status as Bollywood's most profitable female star. Trade analyst Taran Adarsh reports that "Padmaavat" is Deepika's seventh film to make it past the 100 crore finish line, after Chennai Express, Happy New Year, Yeh Jawani Hai Deewani, Bajirao Mastani, Ram-Leela and Race 2. Malaysia Ban Padmaavat

వంద కోట్ల క్లబ్ లో చేరిన పద్మావత్

Posted: 01/29/2018 06:10 PM IST
Padmaavat first weekend collections

తీవ్ర ఉద్రిక్తతల మ‌ధ్య విడుద‌లైన‌ప్ప‌టికీ వ‌సూళ్ల విష‌యంలో సంజయ్ లీలా భన్సాలీ 'ప‌ద్మావ‌త్' చిత్రం ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. మొద‌టి రెండ్రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్కును దాటేసిన ఈ చిత్రం, మొద‌టి వారాంతానికి రూ. 100 కోట్ల మార్కును దాటింది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా శుక్ర‌, శ‌ని, ఆదివారాలు ఇలా దీర్ఘ‌వారాంతం ఈ సినిమాకు కలిసొచ్చింది.

శ‌ని, ఆదివారాల్లో మెట్రో న‌గ‌రాల్లో ఎక్కువ క‌లెక్ష‌న్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. పెయిడ్ ప్రీవ్యూస్‌తో క‌లిపి నాలుగు రోజుల్లో ప‌ద్మావ‌త్ చిత్రం రూ. 114 కోట్ల వ‌రకు వ‌సూలు చేసిన‌ట్లు ట్రేడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు. నిజానికి విశ్లేష‌కుల అంచ‌నా ప్ర‌కారం మొద‌టి వారాంతంలో రూ. 140 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయాల్సి ఉంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు అడ్డంకులు రావ‌డంతో వ‌సూళ్లు ప‌డిపోయాయ‌ని బాక్సాఫీస్ ఇండియా వెల్ల‌డించింది.

బుధ‌వారం రూ. 5 కోట్లు (పెయిడ్ ప్రీవ్యూస్‌), గురువారం రూ. 19 కోట్లు, శుక్ర‌వారం రూ. 32 కోట్లు, శ‌నివారం రూ. 27 కోట్లు, ఆదివారం రూ. 30 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు సంజ‌య్‌లీలా భ‌న్సాలీ, వయాకామ్ 18 సంస్థ‌తో క‌లిసి రూ. 190 కోట్ల పైచిలుకు బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. మరో వారం పాటు ఏ చిత్రం లేకపోవటంతో వసూళ్ల ప్రభంజనం కొనసాగే అవకాశం ఉంది.

మలేషియాలో నిషేధం.. 

మ‌లేషియాలో పద్మావత్ పై బ్యాన్ పడింది. ఈ సినిమా విడుద‌ల‌కు అక్క‌డి సెన్సార్ బోర్డ్ ఎల్‌పీఎఫ్ ఒప్పుకోలేదు. ముస్లింల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే స‌న్నివేశాలు ఉన్నాయ‌ని, మ‌లేషియాలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్న కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల‌కు అంగీక‌రించ‌డం లేద‌ని ఎల్‌పీఎఫ్ చైర్మ‌న్ మ‌హ్మ‌ద్ జాంబేరీ అబ్దుల్ అజీజ్ తెలిపారు.

సినిమా క‌థాంశ‌మే ముస్లింల భావాల‌కు వ్య‌తిరేకంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. అయితే సినిమాలో హిందువుల‌ను కించ‌ప‌రిచే విష‌యాలున్నాయ‌ని భార‌త్‌లో క‌ర్ణి సేన నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రో ముస్లిం దేశం పాకిస్థాన్‌లో ఎలాంటి క‌ట్స్ లేకుండా ఈ సినిమా విడుద‌లకు అక్క‌డి సీబీఎఫ్‌సీ అంగీక‌రించటం గమనార్హం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles