Ram Charan No Gap for Boyapati Movie | చెర్రీ.. పక్కా ఫ్లానింగ్ తోనే...

Charan no gap for next

Ram Charan, Boyapati Srinu, RC 12, Rangasthalam, Ram Charan Next

Ram Charan Immediately joins for Boyapati Srinu Movie without taking any rest. He planned to complete Boyapati movie by July and Ready to Rajamouli Multi Starrer.

బోయపాటి కోసం చెర్రీ గ్యాప్ లేకుండానే...

Posted: 01/29/2018 04:46 PM IST
Charan no gap for next

ప్రస్తుతం చరణ్ .. సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ లో ఉంది. అంతలోనే చరణ్ తో బోయపాటి సినిమా మొదలైపోయింది. బోయపాటి ఇప్పటికే ఇతర పాత్రలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించేస్తున్నాడు. ఈ క్రమంలో ఫస్టు షెడ్యూల్ ను కూడా పూర్తి చేసేశాడు. త్వరలోనే రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు.

ఇక ఫిబ్రవరి 19 నుంచి చరణ్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నాడంట. అంటే రంగస్థలం షూటింగ్ అయిపోగానే.. పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే బోయపాటి షూటింగ్ లో చెర్రీ జాయిన్ అవుతాడన్నమాట. ఆపై నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొని జూలై కల్లా తన పార్ట్ ను పూర్తి చేయాలని చెర్రీ భావిస్తున్నాడు. అటుపై రాజమౌళి చిత్రం కోసం సిద్ధమవుతాడని చెబుతున్నారు.

పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను బోయపాటి రూపొందించబోతున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, వివేక్ ఒబెరాయ్ .. స్నేహా కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles