Vakkantham Vamsi Story for Debutante Director | కొత్త డైరెక్టర్ కోసం పవర్ ఫుల్ కథ.. టచ్ చేసేశాడంట!

Vakkantham vamsi story for raviteja

Vakkantham Vamsi, Director Vikram Sirikonda, Touch Chesi Chudu, Vakkantham Ravi Teja

Vakkantham Vamsi Given Powerful Story to Debutante Director Vikram Sirikonda. Raviteja Starrer Touch Chesi Chudu Power full story given by Vamsi.

టచ్ చేసి చూడుకు వక్కంతం వంశీ కథ

Posted: 01/19/2018 05:17 PM IST
Vakkantham vamsi story for raviteja

విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' సినిమా తెరకెక్కింది. రాశిఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మాస్ రాజా పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్ లు ప్రారంభించగా.. వివరాలను దర్శకుడు విక్రమ్ వివరించాడు. చాలాకాలం నుంచి స్క్రిప్ట్ విభాగంలో పనిచేస్తూ వస్తోన్న తనకి, ఈ సినిమాతో దర్శకుడిగా అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశాడు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకి వక్కంతం వంశీ కథను అందించాడటం. ఆ కథను వినిపించగానే రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని విక్రమ్ చెప్పుకొచ్చాడు. సాధారణంగానే పవర్ ఫుల్ కథలను అందించే వంశీ, పోలీస్ కథలంటే మరీ ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుంటాడు. ఆ లెక్కన్న పవర్ ఫుల్ కథనే అందించాడని విక్రమ్ తెలిపాడు.

ఇక హీరోయిన్ల గ్లామర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని.. ప్రీతమ్ సంగీతం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఈ సినిమా తమకి తప్పకుండా హిట్ ను ఇస్తుందనే నమ్మకం ఉందని వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 2న టచ్ చేసి చూడు రిలీజ్ కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles