Vijay Sethupathy Seethakaathi First look Shocks | హీరో మేకోవర్.. మొత్తం ఇండస్ట్రీ షాక్

Vijay sethupathi seethakaathi first look

Actor Vijay Sethupathi, Seethakaathi, First look, Balaji Tharaneetharan, Vijay Sethupathi 25th Movie, Makkal Selvan 25, MK25 Movie

Actor Vijay Sethupathi on his birthday released the first-look poster of his upcoming 25th film, Seethakaathi. Kollywood Shocks with Actor's make over. First look look proves the actor's versatility once again. This is Vijay Sethupathy's second film with Balaji Tharaneetharan.

సీతకత్తి ఫస్ట్ లుక్.. వృద్ధుడి గెటప్ లో విజయ్ అదుర్స్

Posted: 01/17/2018 01:12 PM IST
Vijay sethupathi seethakaathi first look

బ్యాక్ టూ బ్యాక్ హిట్లు.. వివాదరహితుడు. పైగా సంఘ సేవలు. తమిళనాడులో నటుడు విజయ్ సేతుపతికి ఇప్పుడు ‘మక్కల్ సెల్వన్’ గా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏడాదికి నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ.. వాటిని హిట్లుగా మార్చేస్తున్నాడు. 40 ఏళ్ల ఈ హీరో తన వయసుకు మించిన పాత్రలు చేసేందుకు కూడా ఇప్పుడు సిద్ధమైపోయాడు.

విజయ్ ముఖ్యపాత్రలో స్టిల్ సీతకత్తి అనే సినిమా రాబోతుంది.  బాలాజీ తరణి తరన్ ఈ చిత్రానికి ర్శకత్వం వహిస్తున్నాడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను నిన్న విడుదల చేశారు. ఇందులో ఉంది విజయ్ సేతుపతి అని తెలిసేసరికి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఇక ఈ మేకప్ వేసుకోవడానికి కనీసం నాలుగు గంటల టైం పడుతోందట. ప్రాస్తేటిక్స్ పద్ధతి ఉపయోగించి చేసే ఈ మేకప్ చేయించుకోవడానికి చాలా సహనం ఉండాలి. గోవింద్ పి మేనన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ.

ఈ లుక్కు చూసిన వారంతా రానున్న రోజుల్లో విజయ్ సేతుపతి అగ్రహీరోగా చెలామణి కావటం ఖాయమంటూ కితాబు ఇస్తున్నారు. సీతకత్తి విజయ్ కి 25వ చిత్రం. దీంతోపాటు జుంగ అనే మరో చిత్రంలో డాన్ క్యారెక్టర్ లో విజయ్ నటిస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెల షెడ్యూల్ లో విజయ్ షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు చెబుతున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles