Kollywood Actor Re Entry in Politics after Two Decades | భాగ్యరాజ్.. 25 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి...

Bhagyaraj joins aiadmk

K Bhagyaraj, Tamil Nadu politics, AIADMK, MGR MMK, Bhagyaraj Politics

Writer-director-actor K Bhagyaraj announced that he will join politics soon. There is a chance he may join AIADMK. It has to be noted here, this is not first time Bhagyaraj joining politics. In 1989 itself he launched a party named MGR Makkal Munnetra Kazhagam and Failed.

అన్నాడీఎంకేలో చేరనున్న నటుడు భాగ్యరాజ్

Posted: 01/10/2018 12:12 PM IST
Bhagyaraj joins aiadmk

అమ్మ మరణం తర్వాత రాష్ట్రంలో స్తబ్థత నెలకొన్న వేళ సినీ రంగ ప్రముఖులు రాజకీయాల్లోకి అరంగ్రేటం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కమల్, రజనీ తర్వాత ఇప్పుడు మరో సీనియర్ నటుడు కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు.

రచయిత కమ్ నటుడు కమ్ దర్శకుడు కే భాగ్యరాజ్ త్వరలో తాను అన్నాడీఎంకే పార్టీలో చేరబోతున్నట్లు సంకేతాలు అందించారు. ఎంజీఆర్ స్థాపించిన పార్టీ ప్రస్తుతం దీనస్థితిలో ఉంది. ఆయన భక్తుడిగా ఆ పార్టీలో చేరి సేవలు అందించాలనుకుంటున్నా అని భాగ్యరాజ్ ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే భాగ్యరాజ్ రాజకీయాల్లోకి రావటం ఇదేం కొత్త కాదు. 1989లో ఆయన సొంతగా ఓ పార్టీని కూడా స్థాపించారు. ఎంజీఆర్ మక్కల్ మున్నేట్ర కగజమ్ పేరిట పార్టీని నెలకొల్పి భిన్నంగా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే అది ఎంత ఘోరంగా విఫలం అయ్యిందంటే.. ఒకే ఒక్క అభ్యర్థికి 87 ఓట్లు నమోదు అయ్యాయి. దీంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాల వైపు మళ్లారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దృష్టి రాజకీయాల వైపు మళ్లటం విశేషం. కానీ, మునిగిపోయే నావ లాంటి పరిస్థితికి చేరువవుతున్న అన్నాడీఎంకేలో చేరటం భాగ్యరాజ్ కు ఏ మాత్రం సహకరిస్తుందనేది అనుమానంగానే మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles