Meet Allu Ayaan Rana's Young Batch mate | రానా బ్యాచ్ లో చేరిన ఈ పిల్లాడు ఎవరో తెలుసా?

Rana with bunny son pic viral

Rana Daggubati, Allu Ayaan, Christmas Celebrations, Rana Allu Ayaan, Rana Bunny Son, Allu Arjun Son Ayaan

Rana Daggubati Shared a Photo with Allu Arjun's Son Allu Ayaan. Rana Says Ayaan also his Batch-mate.

బన్నీ కొడుకుతో రానా.. ఫోటో వైరల్

Posted: 12/26/2017 12:21 PM IST
Rana with bunny son pic viral

టాలీవుడ్ లో పరిస్థితులు ఇంతకు ముందులా లేవ్. యంగ్ జనరేషన్ హీరో, హీరోయిన్లంతా కేవలం కెరీర్(సినిమాల) పరంగానే తమ ఆధిపత్యం ప్రదర్శిస్తూన్నారే తప్ప.. వ్యక్తిగతంగా ఎలాంటి దూషణలకు పోవటం లేదు. హిట్ గర్వాన్ని తెరకెక్కించుకోకుండా వీరు ముందుకు సాగుతుండటం విశేషం.

ఈ క్రమంలో ఒకరికొకరు సాయం చేసుకుంటుండం కూడా చూస్తున్నాం. ఇక ఆ లిస్ట్ లో యంగ్ హీరో రానా దగ్గుబాటి కూడా ఉన్నాడు. తాజాగా రానా తన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తో కలిసి దిగిన ఒక ఫొటోను పోస్ట్ చేసిన రానా, దానికి ఒక కామెంట్ జత చేశాడు.

"క్రిస్మస్ లంచ్‌లో అల్లు వారి అబ్బాయి.. నేను. దీనిని బట్టి నాకు అర్థమవుతున్నది ఏమిటంటే, నా స్నేహితులంతా చాలా యంగ్‌గా తయారవుతున్నారు" అంటూ రానా ఫన్నీగా ఓ పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే నా పేరు సూర్య సినిమా షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొంటుండగా... రానా ఓ మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles