Another Honorary doctorate on Priyanka Chopra | సొంతూళ్లో ప్రియాంక చోప్రాకు గౌరవం

Priyanka chopra to receive honorary doctorate

Priyanka Chopra, Bareilly, Doctorate, Dr Keshav Kumar Agrawal, The University of Bareilly

Priyanka Chopra to be honoured with a doctorate degree in her hometown Bareilly. From a small town Bareilly to the global arena, desi girl Priyanka Chopra has come a long way.

ప్రియాంక చోప్రాకు సొంతూళ్లో గౌర‌వం

Posted: 12/23/2017 06:28 PM IST
Priyanka chopra to receive honorary doctorate

హాలీవుడ్ లో రాణిస్తున్న ప్రియాంక చోప్రాకు మళ్లీ దేశీవాలీ ట్యాగ్ లైన్ తగిలింది. అది గౌరవపూర్వకంగానే లేండి. ప్రియాంక చోప్రాకు ఉత్త‌రప్ర‌దేశ్‌లోని బ‌రేలీ అంత‌ర్జాతీయ యూనివ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్ ప్ర‌దానం చేయ‌నుంది.

బ‌రేలీ ప్రియాంక స్వ‌స్థ‌లం. దాదాపు ఐదేళ్ల త‌ర్వాత ఆమె ఈ ప్రాంతానికి రాబోతోంది. దీన్ని పుర‌స్క‌రించుకుని ఆమెకు గౌర‌వ డాక్ట‌రేట్ ఇవ్వాల‌ని నిశ్చ‌యించుకున్న‌ట్లు యూనివ‌ర్సిటీ ఛాన్స్‌ల‌ర్ కేశవ్ కుమార్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్రమంత్రి హర్షవర్థన్‌, యూపీ ఆర్థికమంత్రి రాజేశ్‌ అగర్వాల్‌ హాజరుకానున్నారు.

తన కుమార్తెకు డాక్టరేట్‌ ప్రకటించడం పట్ల ప్రియాంక తల్లి మధు చోప్రా హర్షం వ్యక్తంచేశారు. కాగా, విద్య, వైద్యం, బాలికలకు విద్య అందించే లక్ష్యంతో ప్రియాంక ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె యునిసెఫ్‌ అంతర్జాతీయ సౌహార్ద రాయబారిగానూ ఉన్నారు. ఇవాళ ఉద‌యం ఢిల్లీలో యునిసెఫ్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొన్నారు. ఆ కార్య‌క్ర‌మం త‌ర్వాత బ‌రేలీ బ‌య‌ల్దేర‌నున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles