Historian panel for Padmavati Movie Clarence | పద్మావతి చిత్రానికి మరో పెద్ద సమస్య.. మార్చి దాకా రిలీజ్ కష్టమే!

Padmavati gets another shock

Padmavati, CBFC, Historians Panel, Padmavati Release, Gujarat Elections, Censor Board Padmavati Movie

CBFC to set up historians’ panel on Padmavati, may not release before March. The Padmavati team, which was hoping to get a quick censor clearance after the Gujarat elections may be in for disappointing news.

పద్మావతి రిలీజ్ పై మరో షాకింగ్ న్యూస్

Posted: 12/21/2017 07:41 PM IST
Padmavati gets another shock

బాలీవుడ్ లో పద్మావతి చిత్రానికి కష్టాలు మరికొంత కాలం తప్పేలా కనిపించటం లేదు. ఈ చిత్రంపై ఇటీవలె పార్లమెంట్ ప్యానెల్ కమిటీ సెన్సార్ బోర్డును, చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని విచారించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు చరిత్రకారులతో ఓ సంఘం ఏర్పాటు చేసి చిత్రంపై విశ్లేషణ చేయాలని భావిస్తోంది. అది ఏర్పాటయి క్లియరెన్స్ ఇస్తేనే చిత్రం విడుదలవుతుందని తెలుస్తోంది. కాగా, రిలీజ్ డిలే అవుతుండటంతో ఇబ్బంది పాలవుతున్న చిత్ర యూనిట్ కు ఈ వార్త షాకింగ్ లాంటిదే.

ఎందుకంటే గుజరాత్ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత పద్మావతి రిలీజ్ కు లైన్ క్లియర్ అవుతుందని మేకర్లు భావించారు. కానీ, ఇప్పుడు తాజా నిర్ణయంతో మరికొంత కాలం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. దీనికితోడు 40 చిత్రాలు క్యూ లో ఉన్నాయని సీబీఎఫ్ సీ ప్రకటించటంతో రమారమీ మార్చి వరకు ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం దరిదాపుల్లో కనిపించటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles