Low Quality Baahubali Remake in Bhojpuri | బాహుబలి అక్కడ రీమేక్.. ఎలా ఉండబోతుందో?

Baahubali bhojpuri version

Baahubali, Bhojpuri Remake, Dinesh Lal Yadav Nirahua, Veer Yoddha Mahabali, Amrapali Dubey, Iqbal Baksh, Mahabali Baahubali

Dinesh Lal Yadav Nirahua’s Bhojpuri film Veer Yoddha Mahabali a remake of Prabhas’ Baahubali. Nirahua took to his Facebook page to share images from the sets of his film Veer Yoddha Mahabali.

భోజ్ పురిలో బాహుబలి రీమేక్.. స్టిల్స్ విడుదల

Posted: 12/21/2017 07:16 PM IST
Baahubali bhojpuri version

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అందరిని ఎంతగానో ఆకట్టుకున్న బాహుబలి సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా దెబ్బకు బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. అంతే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారి ఒక టాలీవుడ్ సినిమా జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును అందుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ - అనుష్క ఇంకా రానా మెయిన్ లీడ్ లో కనిపించిన సంగతి తెలిసిందే.

బాహుబలి సినిమా గురించి దేశమంతటా అందరికి తెలిసిందే. అయితే ఎవరు ఊహించని విధంగా ఆ సినిమాను భోజ్ పురిలో తెరకెక్కిస్తున్నారు. దినేష్ లాల్ యాదవ్ హీరోగా బాహుబలి సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండు భాగాలుగా చిత్రీకరించిన ఈ సినిమాకు మొత్తంగా 400 కోట్లవరకు ఖర్చయ్యింది. మరి వాళ్లు ఎలా చిత్రీకరిస్తారు అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇక్బాల్ భక్ష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో భోజ్ పురి సెక్సీ క్వీన్ ఆమ్రపాలి దుబే హీరోయిన్ గా చేస్తోంది.

ఈ చిత్ర టీజర్ ను జనవరిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. మరి ఈ లో బడ్జెట్ బాహుబలి ప్రేక్షకులను ఏ మేర అలరిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles