Mohini Trailer : Trisha Back with Sexy and Scary Avatar | మోహిని ట్రైలర్.. సెక్సీ త్రిష వణికిస్తోంది

Trisha mohini trailer out

Trisha, Jacky Bhagnani, Mohini Movie, Mohini Trailer, Trisha Mohini Trailer, Ramana Madhesh, Sexy Trisha Mohini

Trisha's New Movie Mohini Trailer Released. A horror film starring Trisha and Jacky Bhagnani in lead roles under Ramana Madhesh's direction.

త్రిష మోహిని ట్రైలర్.. భయపెట్టిస్తోందిగా...

Posted: 12/21/2017 05:54 PM IST
Trisha mohini trailer out

సీనియర్ నటి త్రిష తన జోరును కొనసాగిస్తూనే ఉంది. తెలుగులో తమిళ్ లో ఛాన్సులు దక్కకపోయినా.. మధ్య మధ్యలో నాయికా ప్రాధాన్యత కలిగిన పాత్రలతో పాటు హారర్ సినిమాలకి కూడా ఆమె ఓకే చెప్పేస్తోంది. అయితే 'నాయకి' సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, నటన పరంగా ఆమెకి ప్రశంసలు తెచ్చిపెట్టింది.

ఇప్పుడు అదే తరహాలో 'మోహిని' అనే హారర్ థ్రిల్లర్ సినిమా చేసింది. రమణ మాదేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, త్వరలో విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంత సేపటి క్రితం తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సెక్సీగా ఉన్న త్రిష మనుషులను అలవోకగా చంపేయటం. యాక్షన్ .. సస్పెన్స్ .. హారర్ .. రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. మోహినిగా మోడ్రన్ గాను .. దెయ్యంగాను త్రిష అద్భుతమైన వేరియేషన్స్ చూపించింది.

ఫోటో గ్రఫీ .. గ్రాఫిక్స్ ఈ సినిమాను ఓ మెట్టు పైకి తీసుకెళ్లేలా వున్నాయి. ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తోన్న రిచ్ నెస్ చూస్తుంటే, ఈ సినిమా కోసం భారీ స్థాయిలోనే ఖర్చు చేశారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా త్రిషకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి. ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ లండన్ లో జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohini Movie  Trisha  మోహిని చిత్రం  త్రిష  

Other Articles