Ram Charan Handle Two Top Directors at one Time | రాజమౌళి లేట్ అయినా ఫర్వాలేదంట.. మరో స్టార్ దర్శకుడు ఎవరంటే...

Ram charan two major projects

Ram Charan, SS Rajamouli, NTR, Multi-Starrer, Koratala Siva, Ram Charan Upcoming Movies, Ram Charan Two Star Directors, Ram Charan 2018 Movies

Ram Charan Koratala Siva Movie Finalized. After Boyapati Ram Charan already commit with Rajamouli. In case of any delay he proceed with Koratala Project.

ఒకేసారి ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో రామ్ చరణ్

Posted: 12/20/2017 01:22 PM IST
Ram charan two major projects

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రంగా రూపొందుతున్న చిత్రం 'రంగస్థలం'. గ్రామీణ ఆధిపత్యం నేపథ్యంలో ఈ చిత్రం రాబోతుందని.. ఇందులో చెర్రీ పడవ నడుపుకునే చిట్టిబాబు పాత్రలో.. సమంత గేదెలు కాసుకునే మహాలక్ష్మీ పాత్రలో కనిపించబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా తరువాత చరణ్ .. బోయపాటితో ఓ సినిమా చేయబోతున్నాడు. అదయ్యాకే రాజమౌళి భారీ మల్టీ స్టారర్ లో జాయిన్ అవుతాడనే చెప్పుకున్నాం. అయితే ఒకవేళ పొరపాటున ఆ ప్రాజెక్టు ఆలస్యం అయితే మాత్రం సేఫ్ సైడ్ గా మరో ప్రాజెక్టును సిద్ధంగా ఉంచుకున్నాడంట. ఆ సినిమాకి దర్శకుడు ఎవరో కాదు .. కొరటాల శివ.

ఇప్పటికి ఈ కాంబినేషన్లో రెండు సార్లు సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ ప్రాజెక్టు సెట్ అయిందనేది తాజా సమాచారం. ఒకవేళ రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యమైనా, కొరటాలతో చరణ్ సినిమా మొదలైపోతుందని అంటున్నారు. ఈ రెండూ క్రేజీ కాంబినేషన్లే కావడం మెగా అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles