Hichki Movie Official Trailer Review | రాణి రీఎంట్రీ.. ఎమోషనల్ హిచ్ కీ.. గెండెను తాకింది

Hichki official trailer

Rani Mukerji, Hichki Movie, Hichki Trailer, Siddharth P Malhotra, Jasleen Royal, Rani Mukerji Hichki

Rani Mukerji Hichki Trailer Released. After a long time Rani Mukerji Plays a Physically Challenged Person Again in 'Hichki'. Hichki similar to Front of the Class Hollywood Movie.

రాణి ముఖర్జీ రీ ఎంట్రీ.. ఎమోషనల్ హిచ్ కీ

Posted: 12/20/2017 12:31 PM IST
Hichki official trailer

బాలీవుడ్ లో ఒకప్పుడు గ్లామర్ తోపాటు ఫెర్ ఫార్మెన్స్ తో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు నటి రాణి ముఖర్జీ. తర్వాత వివాహం చేసుకుని చిత్రాలకు దూరమైపోయిన ఆమె ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమైపోయారు. హిచ్ కీ పేరుతో ఓ సినిమాతో మన ముందుకు రానున్నారు. సిద్ధార్థ్ పీ మల్హోత్రా డైరెక్ట్ చేసిన ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యింది.

టురెట్ సిండ్రోమ్ అనే న్యూరలాజికల్ డిజార్డర్ బాధపడే ఓ మహిళకు టీజర్ కావాలనే లక్ష్యం ఉంటుంది. కానీ, ఆమె వ్యాధి వల్ల అది చాలా ఇబ్బందిగా మారుతుంది. బ్రెయిన్ నరాలు లూజ్ కాంటాక్ట్ తో ఉన్నప్పుడు చిన్నపాటి షాక్ లాగా వస్తుంటుంది. దీంతో ఆమె తల విదిలిస్తూ చాక్ చాక్ అంటూ ఓ విచిత్రమైన శబ్దం చేస్తుంటుంది. అయితే ఓ మంచి పేరున్న స్కూలులో టీచర్ ఉద్యోగమొస్తుంది. కానీ, విద్యార్థులు ఆమెను హేళన చేస్తుంటారు. ఇంతలో రైట్ టు ఎడ్యుకేషన్ వల్ల మున్సిపల్ స్కూల్లోని 14 మందికి అదే స్కూలులో అడ్మిషన్ వస్తుంది.

స్పీచ్ డిజాస్టర్ ఉన్న ఆమెను వాళ్లకు టీచర్ గా నియమిస్తారు. చదువుపై ఎలాంటి ఇంట్రస్ట్ లేని వాళ్ల ఆమెను ఓ ఆట ఆడుకుంటారు. చివరకు స్కూల్లో తోటి విద్యార్థులతో వారి ప్రవర్తన మూలంగా.. చదువుకు పనికిరారంటూ స్కూల్ యాజమాన్యం పంపించేందుకు సిద్దమౌతుంది. అప్పుడు ఆమె అడ్డుకుని వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది. ట్రైలర్ లోనే కథ మొత్తం తెలిసిపోయినప్పటికీ ఎమోషనల్ కాన్సెప్ట్ కావటంతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 9న హిచ్ కీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hichki  Rani Mukerji  హిచ్ కీ  రాణి ముఖర్జీ  

Other Articles