Big Deal in Hollywood that Disney Buys Century Fox | హాలీవుడ్ లో భారీ విలీనం.. డిస్నీ చేతికి ప్రముఖ సంస్థ

Disney to buy 21st century fox

The Walt Disney Co, 20th Century Fox, Hollywood Merger, Disney CEO Bob Iger, Disney Company, Hollywood Big Merger, Disney Buys Century Fox

Disney to Buy 21st Century Fox Assets for $52.4 Billion in Historic Hollywood Merger. Disney CEO Bob Iger extends contract through 2021 to oversee integration

హాలీవుడ్ లో భారీ విలీనం.. డిస్నీ చేతికి టీ20 ఫాక్స్ సెంచరీ

Posted: 12/15/2017 07:02 PM IST
Disney to buy 21st century fox

హాలీవుడ్ లో భారీ విలీనం జరిగింది. సినీ నిర్మాణ సంస్థ ట్వంటీఫ‌స్ట్ సెంచ‌రీ ఫాక్స్‌ను, మ‌రో నిర్మాణ సంస్థ డిస్నీ సొంతం చేసుకుంది. 52.4 బిలియ‌న్ డాల‌ర్ల ఒప్పందంతో ఫాక్స్ సంస్థ‌కు చెందిన స్టూడియోలు, నేష‌న‌ల్ జియోగ్ర‌ఫీ నెట్‌వ‌ర్క్‌, ఆసియాలోని స్టార్ టీవీల‌ను చేజిక్కించుకుంది.

అలాగే స్కై, హులూ, ఇత‌ర ఫాక్స్ స్థానికి నెట్‌వ‌ర్క్‌ల్లో షేర్ల‌ను కూడా యానిమేషన్ చిత్రాలను నిర్మించే డిస్నీ ద‌క్కించుకుంది. ఈ ఒప్పందంతో ఫాక్స్ సీఈఓ జేమ్స్ ముర్దోచ్ వైదొల‌గ‌నున్నారు. ఈ విలీనం ద్వారా డిస్నీ శ‌క్తివంత‌మైన ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్రాండ్‌గా ఎదిగింది. ప్ర‌పంచ ప్రాచుర్యం పొందిన వెబ్‌ స్ట్రీమింగ్ స‌ర్వీస్ నెట్‌ఫ్లిక్స్‌కి పోటీగా మ‌రో కొత్త స్ట్రీమింగ్ స‌ర్వీస్‌ను ఆవిష్క‌రించేందుకు డిస్నీ ఎప్ప‌ట్నుంచో ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.

కానీ త‌మ ప్రొడ‌క్ష‌న్‌లు ఎక్కువ డేటా లేక‌పోవ‌డంతో ఆగిపోయింది. ఇప్పుడు ఫాక్స్ విలీనం వ‌ల్ల ఎక్స్‌మెన్‌, సింప్స‌న్స్‌, ఫ్యామిలీ గై వంటి ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాలు వారి సొంత‌మ‌య్యాయి. దీంతో ఇప్పుడు ఒక స్ట్రీమింగ్ స‌ర్వీస్ పెట్టే అర్హ‌త డిస్నీకి వ‌చ్చిన‌ప్ప‌టికీ నెట్‌ఫ్లిక్స్ నుంచి గ‌ట్టిపోటీని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles