Dhanush Again Director's Cap for Periodic Movie | ఆ అవతారంలో మళ్లీ ధనుష్.. భారీ బడ్జెట్ ను హ్యాండిల్ చేస్తాడా?

Actor dhanush to direct period drama film

Actor Dhanush, Thenandal Studios Limited, Pa Paandi Movie, Dhanush again Direct, Dhanush New Movies, Dhanush Big Budget Movie

Actor Dhanush, who made his directorial debut in Pa Paandi, is all set to don the director’s hat again for an upcoming period drama film.The film will be backed by Thenandal Studios Limited and will have Dhanush direct the project. Not only this, but the actor will also be the protagonist in the film.However, an official confirmation is awaited from TSL’s side or Dhanush’s side.

భారీ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్న ధనుష్

Posted: 12/15/2017 05:36 PM IST
Actor dhanush to direct period drama film

కోలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో ధనుష్ పేరు తప్పకుండా కనిపిస్తుంది. మల్టీ టాలెండెడ్ అయిన ధనుష్ తానేంటో ప్రూవ్ కూడా చేసుకున్నాడు. యుగానికొక్కడు, త్రీ సినిమాలో గాత్రంతో సింగర్ గా, 'పా పాండి' సినిమాకి డైరెక్షన్ చేసి హిట్ అందుకోవటమే కాదు.. ఏకంగా సూపర్ స్టార్ రజనీనే ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. 

ఈ ప్రయత్నంలో మరో బంఫరాఫర్ ఆయనకు దక్కినట్లు తెలుస్తోంది. తేనాండాళ్ ఫిలిమ్స్ వారు నిర్మిస్తోన్న ఒక సినిమాలో తానే హీరోగా నటిస్తూ .. దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టనున్నాడు. పిరియాడిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి పనులు చకచకా జరిగిపోతున్నాయి. 

స్వాతంత్ర్యం రావడానికి ముందు జరిగే పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందట. ప్రస్తుతం రజనీతో 'కాలా' సినిమాను నిర్మిస్తోన్న ధనుష్, గౌతమ్ మీనన్ .. వెట్రిమారన్ దర్శకత్వంలో హీరోగా చేస్తున్నాడు. హాలీవుడ్ లో కూడా ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలు పూర్తికాగానే కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడంట. అయితే ధనుష్ వైపు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles