KICK 2 Effect Rakul says no to Raviteja | కిక్-2 ఎఫెక్ట్.. మాస్ రాజాకు రకుల్ నో.. తమన్నా ఓకే!

Rakul no to raviteja

Rakul Preet Singh, Ravi Teja, Tamannah, Director Kalyan Krishna, Rakul Tamannah, Rakul No Ravi Teja, Rakul 2018 Movies

Rakul Preet Singh says No to Raviteja Kalyan Krishna New Movie. Tamanna Replaces Rakul for Raviteja Movie.

మాస్ రాజాకు నో చెప్పిన రకుల్

Posted: 12/15/2017 05:14 PM IST
Rakul no to raviteja

రాజా ది గ్రేట్ ఇచ్చిన సక్సెస్ తో  రవితేజ 'టచ్ చేసి చూడు' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ఏ ప్రాజెక్టు చేయనున్నాడనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు గానీ, కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది.

'సోగ్గాడే చిన్ని నాయనా' .. 'రారండోయ్ వేడుక చూద్దాం'తో హిట్స్ అందుకున్న కల్యాణ్ కృష్ణ .. వైవిధ్యభరితమైన ఓ కథను రవితేజకు వినిపించి ఓకే అనిపించాడని తెలుస్తోంది. దీంతో త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇక ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను తీసుకుకోవాలని మొదట్లో దర్శకుడు భావించాడు. అయితే, ఆమెను సంప్రదించగా .. ఆమె పెద్దగా ఆసక్తిని చూపలేదట. గతంలో రవితేజతో చేసిన 'కిక్ 2' సక్సెస్ కాకపోవడం అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రకుల్ ఇంట్రెస్ట్ చూపకపోవడంతో, రవితేజ జోడీగా తమన్నాను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'బెంగాల్ టైగర్' వచ్చిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles