Goa mulls ban on Padmavati Amid Parrikar Comments | పద్మావతి బ్యాన్ కోసం మరో రాష్ట్రం రెడీ!

Padmavati may ban in goa also

Goa, Padmavati Movie, CM Manohar Parrikar, Padmavati Ban, Parrikar on Padmavati,

Goa State Ready to Ban Padmavati Movie. Goa can’t afford law and order trouble because of ‘Padmavati’ in tourist season: Manohar Parrikar The chief minister said he will consider the state BJP women’s wing’s demand for a ban on the film only after the censor board approves it.

గోవాలోనూ పద్మావతి చిత్రం బ్యాన్?

Posted: 12/08/2017 07:13 PM IST
Padmavati may ban in goa also

విడుదలకు ముందే వివాదాస్పదంగా మారిన పద్మావతి చిత్రం గురించి గత కొన్నిరోజులుగా ఎలాంటి వార్తలు వెలువడటం లేదు. దీంతో వివాదం సమసిపోతుందని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు గోవా రాష్ట్రం కూడా నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ఆ రాష్ట్ర సీఎం మనోహర్ పారికర్ వ్యాఖ్యలే నిదర్శనం.

పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా కొనసాగుతున్న గోవా రాష్ట్రం శాంతి, భద్రతల సమస్యలను భరించే స్థితిలో లేదని మనోహర్ పారికర్ పేర్కొన్నారు. ఈ దృష్ట్యా సంజయ్ లీలా భన్సాలీ చిత్రమైన పద్మావతిని రాష్ట్రంలో ప్రదర్శించకుండా నిషేధించాలన్న బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ ను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఈ సినిమాను నిషేధించాలని కోరుతూ బీజేపీ మహిళా విభాగం ప్రతినిధులు ఇప్పటికే ముఖ్యమంత్రిని కలసి కోరడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ రాలేదని, అది వచ్చిన తర్వాత తాము ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే సినిమాలో వివాదాస్పద అంశాలను తొలగించడం జరుగుతుందన్నారు.

‘‘నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే చరిత్రను సరైన రీతిలో చూపించాలి. తప్పుడు మార్గంలో దాన్ని చిత్రీకరిస్తే ప్రజల మనోభావాలు గాయపడతాయి’’ అని పారికర్ పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని చిత్రాన్ని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇంకోవైపు నటి షబానా అజ్మీ నేతృత్వంలో బచావ్ పద్మావతి పిటిషన్ పై సంతకాల సేకరణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles