Simbu Not Answerable Any Allegations | శింబుపై సంచలన ఆరోపణలు.. హీరోయిన్లు వణికిపోతున్నారంట!

Kollywood producer claims simbu

Actor Simbu, Michael Rayappan, Simbu Producer, TFPC Simbu, AAA Movie, Allegations on Simbu

Simbu is once again in the news for wrong reasons. His former film producer Michael Rayappan approached TFPC with a complaint to resolve Loss issue.But, TSR says “I cannot be answerable to a film which is already released.

శింబుపై నిర్మాత సంచలన ఆరోపణలు

Posted: 12/01/2017 03:43 PM IST
Kollywood producer claims simbu

కోలీవుడ్ యంగ్ హీరో శింబుపై ప్రముఖ నిర్మాత మైఖేల్ రాయప్పన్ చేసిన ఆరోపణలు ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. 'అంబనవన్ .. ఆసరాథవన్ .. అదంగథవన్' సినిమా వీళిద్దరి కాంబోలోనే తెరకెక్కింది. ఈ సినిమా నిర్మాణ సమయంలో తమని శింబు నానా ఇబ్బందులు పెట్టేశాడంటూ ఆయన తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

"శింబులాంటి అన్ ప్రొఫెషనల్ బిహేవియర్ వున్న వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు. శింబు ప్రవర్తన చాలా దారుణంగా తయారైంది .. తానో పెద్ద హీరోనని పోజు కొడుతూ ఉంటాడు .. షూటింగ్ ప్లానింగ్ ను ఇష్టానుసారంగా మార్చేస్తూ ఉంటాడు" అని అన్నాడు.శింబు ధోరణి కారణంగా ఆయన సరసన నటించడానికి ఏ హీరోయిన్ ఒప్పుకోవడం లేదని.. ఆయన పేరెత్తితేనే పారిపోతున్నారని మైఖేల్ చెప్పారు. ముందుగా త్రిష .. ఆ తరువాత లక్ష్మీ మీనన్ తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇచ్చేశారంట. ఆ సమయంలో శ్రియను తీసుకుంటే వద్దంటూ శింబు గొడవపెట్టాడని.. దాంతో ఆమె కాంబినేషన్లోని పాటను కూడా షూట్ చేయలేకపోయామని మైఖేల్ ఆరోపించారు.

శింబును ప్రశ్నించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ను తొలగించమంటూ తనపై ఒత్తిడి చేశాడని మైఖేల్ చెప్పాడు. ఆయనపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాం .. చర్యలు తీసుకునే ఆలోచనలో మండలి వుంది" అని వివరించాడు. అయితే శింబు మాత్రం ఆ ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పాడు. చిత్రం విడుదలయ్యాక జరిగే పరిణామాలతో తనకు సంబంధం లేదని.. అయితే విడుదలకు ముందే తనకు బాకీ పడ్డ సొమ్ము కోసం నడిగర్ సంఘాన్ని ఆశ్రయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ తనకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం శింబు వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles