Chiru Filter Coffee Now Available in Hyderabad | చిరు ఫిల్టర్ కాఫీ.. ఎక్కడ దొరుకుతుందో తెల్సా?

Upasana chiru filter cofee

Upasana Konidela, Chiru Filter Coffee, Chiranjeevi Coffee, Upsana Chiru Special, Mega Kodalu New Restaurant, Upasana Restaurant

Upasana Konidela launches Theater cafe. Chiru's filter coffee Availabale There.

ఉపాసన చిరు ఫిల్టర్ కాఫీ స్పెషల్

Posted: 12/01/2017 03:08 PM IST
Upasana chiru filter cofee

మెగా స్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ ఏంటో రీఎంట్రీ చిత్ర సక్సెస్ తోనే తెలిసిపోయింది. రెట్టించిన ఉత్సాహాంతో అభిమానులు థియేటర్లకు క్యూ కట్టగా.. వసూళ్ల పరంగా కూడా బాస్ బాక్స్ బద్ధలు కొట్టేశాడు. ఇక ఆ క్రేజ్ మరో రకంగా వాడుకునేందుకు కోడలు ఉపాసన సిద్ధమైపోయింది.

సాధారణంగా సెలబ్రిటీల పేర్లతో హీరో, హీరోయిన్లు, స్పోర్ట్స్ స్టార్ల పేర్లపై రెస్టారెంట్లను ప్రారంభించడం... వారి పేర్లతో ఆహార పదార్థాలను తయారు చేయడం మనకు తెలిసిన విషయమే. వారికున్న క్రేజ్ కస్టమర్లను రెస్టారెంట్లకు రప్పిస్తుంటుంది. తాజాగా, మెగాస్టార్ పేరిట ఓ ఫిల్టర్ కాఫీ మార్కెట్లోకి వచ్చింది.

అపోలో ఫౌండేషన్ తరపున 'థియేటర్ కేఫ్' పేరిట ఓ కాఫీ షాప్ ను ప్రారంభిస్తున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటల సమయంలో షాప్ ప్రారంభమయ్యింది. జూబ్లీహిల్స్ లోని అపోలో ఎఫ్ఎన్డీ థియేటర్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'ఈ కేఫ్ కు వచ్చి రిలాక్స్ అవ్వండి' అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ కేఫ్ లో చిరు ఫిల్టర్ కాఫీ, హైదరాబాదీ కేసర్ రోజ్ టీ, లుక్మి చికెన్/వెజ్, లామకాన్ వరల్డ్ ఫేమస్ సమోసా, మిర్చి బజ్జీలు అందుబాటులో ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles