Temper Writer gives shock to Bandla | బండ్లకు జైలు శిక్ష. బెయిల్ పై విడుదల... సెటిల్మెంట్ చేసుకోలేడా?

Bandla ganesh cheque bounce case

Bandla Ganesh, Bandla Ganesh Cheque Bounce Case, Erramanzil Court, Cheque Bounce Tollywood Producer, Vakkantham Vamsi Bandla Ganesh, Temper Writer Producer

Bandla Ganesh gets a shock from Vakkantham Vamsi. Bandla Ganesh to be sent to jail for 6 months in cheque bounce case. Later he released on bail.

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్ కు జైలుశిక్ష

Posted: 11/24/2017 03:24 PM IST
Bandla ganesh cheque bounce case

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు కోర్టు జైలు శిక్ష విధించటం, వెంటనే బెయిల్ పై బయటకు రావటం తెలిసిందే. టెంపర్ సినిమా విషయంలో వక్కంతం వంశీకి-బండ్లకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలే ఈ సమస్యకు కారణమని స్పష్టమయ్యింది.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమాకు వక్కంతం వంశీ రచయితగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల 25 లక్షలకుగానూ వక్కంతం వంశీకి ఓ చెక్కు ఇచ్చారు. అది బౌన్స్ కావటంతో చెల్లని చెక్కు ఇచ్చాడంటూ బండ్లపై వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టులో వివరాలను సమర్పించారు.

విచారణ చేపట్టిన కోర్టు బండ్ల గణేశ్ కు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. జైలు శిక్షతో పాటు 15లక్షల 86వేల 550 రూపాయల జరిమానా విధించింది. తీర్పు అనంతరం, బండ్ల గణేష్ బెయిల్ కు దరఖాస్తు పెట్టుకోగా... జడ్జి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అయితే సెటిల్ మెంట్ పరిస్థితులు కూడా దాటిపోయే పరిస్థితి రావటంతో వంశీ కోర్టుకు రావాల్సి వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles