Nani's MCA Movie Release Date Again Change | బడా నిర్మాతల మధ్య డీల్.. నాని మూవీ రిలీజ్ డేట్ మళ్లీ ఛేంజ్?

Nani mca movie release date

Nani MCA, MCA Release Date, Actor Nani, Nani Sai Pallavi Movir Release Date, MCA Official Release Date

Nani MCA Movie Release Date again Changed.. The Makers of MCA and Okka Kshanam Movie Discussed later Dil Raju fixed December 15th Release Date of Nani-Sai Pallavi Starrer Movie.

నాని ఎంసీఏ మూవీ రిలీజ్ డేట్ మారిందా?

Posted: 11/22/2017 02:27 PM IST
Nani mca movie release date

నేచురల్ స్టార్ నాని హీరోగా మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముందుగా క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అఖిల్ హలో తర్వాతి రోజే విడుదల అవుతున్న నేపథ్యంలో కాస్త ముందుగా విడుదల చేయాలని భావించారు.

అయితే 23వ తేదీన అల్లు శిరీష్ 'ఒక్క క్షణం' విడుదల కూడా ఖరారు కావటంతో ఇప్పుడు నాని చిత్రం రిలీజ్ డేట్ మరోసారి మారినట్లు తెలుస్తోంది.'మిడిల్ క్లాస్ అబ్బాయి' ను డిసెంబర్ 15వ తేదీనే విడుదల చేయడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేయనున్నారని అంటున్నారు.

వరుస సినిమాలు విడుదల పెట్టుకోవడం వలన థియేటర్స్ సమస్య తలెత్తే ఛాన్స్ ఉండటం.. పైగా వసూళ్లపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ విషయమై నిర్మాతలు అల్లు అరవింద్ .. దిల్ రాజుల చర్చించినట్లు తెలుస్తోంది. ఎలాగూ ప్రీ రిలీజ్ కు సిద్ధపడ్డ రాజు మరో వారం ముందుగానే సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles