TN Minister Solid Warn to Kamal Haasan | కమల్ కు మంత్రి ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడో చూడండి

Tamil nadu minister warn jayakumar

Kamal Haasan, TN Minister D Jayakumar, Jayakumar Kamal, Kamal Haasan AIADMK Government, Kamal Haasan Baseless Comments

Tamil Nadu Fisheries Minister D. Jayakumar on Monday said the government would take legal action against actor Kamal Haasan if he continues his “baseless” corruption charges.

కమల్ కు తమిళ మంత్రి హెచ్చరిక

Posted: 11/20/2017 05:51 PM IST
Tamil nadu minister warn jayakumar

త్వరలో రాజకీయ ఆరంగ్రేటంకి సిద్ధమైన కమల్ హాసన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేస్తూ ట్వీట్లు చేశాడు.

ప్రభుత్వం దోపిడి చేస్తే అది నేరం అవుతుంది. అది బయటపడ్డాక కూడా నిరూపితం కాకపోవటం(అడ్డుకోవటం) ఇంకా పెద్ద నేరం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇలా చేయటం రాజ్యాంగ విరుద్ధం. నేరస్తులు దేశాన్ని పాలించటం సరికాదు. ప్రజలే పాలకులు. మేల్కోండి అంటూ ట్వీట్లు చేశాడు. మరోవైపు జయలలిత పోయెస్ గార్డెన్, శశికళ, దినకరన్ బంధువుల ఇళ్లో సోదాలు జరిపిన నేపథ్యంలోనే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.

దీనిపై తమిళనాడు మంత్రి డీ జయకుమార్ ఘాటుగా స్పందించారు. ఆధారాలు లేకుండా ఇలా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీప్ పబ్లిసిటీను అస్సలు అంగీకరించబోం.కమల్ ఆరోపణలు చేయదలుచుకుంటే ఫిర్యాదు చేయటానికి కోర్టులు ఉన్నాయని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles