Prakash Raj's Intolerance on Padmavati Controversy | సినిమాలపై కేంద్రం తీరు.. ప్రకాశ్ రాజ్ అసహనం

Prakash raj reacted on padmavati issue

Prakash Raj, Padmavati Controversy, Prakash Raj justasking, Prakash Raj Nude S Durga Issue, Panorama Movie Festival, IFFI Movies List, Prakash Raj AP Special Status

Prakash Raj’s tweet about Padmavati, Nude and S Durga raises the question of intolerance. Prakash Raj tweeted in support Padmavati, Nude and S Durga. The veteran actor questioned the way these films are being treated by various organisations in the country. Prakash Raj raise questions on AP Special Status.

పద్మావతి చిత్ర వివాదంపై ప్రకాశ్ రాజ్ ఆవేదన

Posted: 11/18/2017 09:13 AM IST
Prakash raj reacted on padmavati issue

దీపికా ప‌దుకునే న‌టించిన ‘పద్మావతి’ సినిమాను వివాదాలు చుట్టుముట్టిన విష‌యం తెలిసిందే. ఆ సినిమాను విడుద‌ల చేస్తే విధ్వంస‌మే అంటూ రాజ్‌పుత్‌ కర్ణిసేన చేస్తోన్న వ్యాఖ్య‌ల‌ను సినీన‌టుడు ప్ర‌కాశ్ రాజ్ త‌ప్పుబ‌ట్టారు. కళాకారులపై దాడులకు పాల్పడతామని చేస్తోన్న‌ హెచ్చరికలు ఆందోళనకరమ‌ని ట్వీట్ చేశారు.

అన్ని భాష‌ల్లోనూ య‌థేచ్ఛ‌గా వ‌స్తోన్న‌ అశ్లీల చిత్రాల‌ను ఖండించ‌ని వారు చారిత్రాత్మ‌క చిత్రంలో నటించిన, నటిస్తున్న కళాకారులపై దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించడం ఎంత వరకు స‌రైంద‌ని ప్ర‌కాశ్‌రాజ్‌ ప్రశ్నించారు. మ‌రోవైపు మరాఠీ చిత్రం న్యూడ్, మళయాళ చిత్రం ఎస్ దుర్గ(సెక్సీ దుర్గ అని ముందు పెట్టారు) చిత్రాలను ఇఫ్ఫీ వేడుకల ప్రదర్శన నుంచి తొలగించటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సినిమాల పేర్లను ఆధారంగా చేసుకుని కేంద్ర మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం సరికాదని ఆయన వాదించారు.

ఇదిలా ఉంటే పద్మావతి విషయంలో క‌ర్ణిసేన ఈ విష‌యంపై ఏ మాత్రం త‌గ్గడం లేదు. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తోంది. ఈ సినిమాలో న‌టించిన దీపికా ప‌దుకునే ముక్కుకోయాల‌ని ఒకసారి, ఆమెను చంపితే రూ.5 కోట్లు ఇస్తామ‌ని మరొకసారి క‌ర్ణిసేన ప్రతినిధులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

 

ఏపీకి ఎందుకు అన్యాయం?

కేంద్రప్రభుత్వం చాలా తప్పులు చేస్తోందని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శించారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఆరోగ్యకరమైన విధానం నాశనమవుతోందని అన్నారు. విమర్శను ప్రభుత్వం భరించలేకపోతోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే.. ఆ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఎవరినడిగినా చెబుతారని ఆయన చెప్పారు. బీజేపీ కూడా అదే విషయాన్ని చెప్పిందని ఆయన అన్నారు.

సాక్షాత్తూ ప్రధాని ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ప్రత్యేకహోదా సహా అన్నీ ఇస్తామని అన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని, మౌలిక సదుపాయాలు లేని రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వలేదని అన్నారు. దీనిని మోసం చేయడం కాకపోతే మరేమని అనాలని ఆయన ప్రశ్నించారు. అంతెందుకు, దేశంలో సరైన రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా? అని ఆయన అడిగారు. ఏపీకి ఎందుకు న్యాయం జరగడం లేదని ఆయన ప్రశ్నించారు. సరైన మౌలిక వసతులు లేకుండా కొత్త రాజధానిని ఎలా నిర్మించాలనుకున్నారని ఆయన నిలదీశారు. దీనిని ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా? అన్న ఆయన... అలా ప్రశ్నిస్తే దేశద్రోహులు లేదా ఇంకోటి, అదీ కాకపోతే మరోటి అంటున్నారని, లేదా దాడులు చేస్తామంటున్నారని ఆయన మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles