Reason Behind Kamal Haasan Not Celebrating Birthday | బర్త్ డే సెలబ్రేషన్స్ కాన్సిల్.. దానికి బదలు కమల్ ఏం చేయబోతున్నాడంటే...

Kamal request fans on birthday

Kamal Haasan, Kamal Haasan Birthday, Chennai Floods, Kamal Haasan Medical Camps, Kamal Haasan 63th Birthday, Kamal Haasan Chennai Floods

Kamal Haasan not celebrating his 63th birthday. Instead he will be visiting a medical camp to greet people who were marooned and left in a state of despair by the torrential downpour in Chennai.

కమల్ పుట్టినరోజు వేడుకలు రద్దు.. మెడికల్ క్యాంపులకు పిలుపు

Posted: 11/07/2017 10:43 AM IST
Kamal request fans on birthday

సీనియర్ హీరో కమల హాసన్ నేడు 63వ వడిలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో త్వరలో రాజకీయ ఆరంగ్రేటం చేయనున్న ఆయన కోసం అభిమానులు భారీ ఎత్తున్న పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమైపోయారు. అయితే తన పుట్టిన రోజు వేడుకలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ఆ విలక్షణ నటుడు ప్రకటించటంతో అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగింది.

దీంతో అందుకు కారణం వివరిస్తూ ఆయన తన ట్విట్టర్ లో తమిళం, ఇంగ్లీషుల్లో పోస్టులు పెట్టారు. తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకోవాలన్న ఆలోచనపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారందరికీ తన విన్నపం ఒకటేనని చెప్పారు. ప్రస్తుతం తమిళనాడు తీవ్ర వర్షాలతో అతలాకుతలం అయి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంట. కేవలం పండగ వాతావరణం, వేడుకల కోసమే అయితే, ఒక రోజు ఆలస్యంగానైనే వాటిని జరుపుకోవచ్చని, అయితే, అనుకుంటున్న మార్పు రావాలంటే మాత్రం పద్ధితి ఇది కాదని, ముందుగా మనం మారి చూపాలని హితవు పలికారు.

కాగా, వేడుకలకు బదులు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. గత 40 సంవత్సరాల్లో 200కు పైగా సినిమాల్లో నటించి, ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్న ఆయన, యువరక్తానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles