తమిళ్ నటి మేఘ ఆకాశ్ తెలుగు తెరకు 'లై' సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైంది. ఆ తరువాత సినిమాను కూడా ఆమె నితిన్ జోడీగానే చేస్తోంది. మధ్యలో ఉన్నది ఒకటే జిందగీ లాంటి చిత్రం నుంచి తప్పుకున్న మేఘ తర్వాత మరో రెండు సినిమాల నుంచి కూడా తప్పుకుందనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. అయితే కేవలం నితిన్ కోసమే ఆ సినిమాలను వదిలేసుకుందన్న ఓ పుకారు అప్పుడు వినిపించింది.
ఈ వార్తలన్నింటిని కూర్చి నితిన్ - మేఘ ఆకాశ్ ప్రేమలో పడ్డారనీ .. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారం అంతకంతకూ బలపడుతూ ఉండటంతో చివరకు మేఘ ఆకాశ్ స్పందించింది. 'లై' సినిమాకి కొత్త కథానాయిక కావాలనుకుంటున్నప్పుడు తన పేరును నితిన్ సిఫార్స్ చేయడం వలన, కొంతమంది ఇలా ప్రచారం చేస్తున్నారని చెప్పింది. తాము ప్రేమలో పడినట్టుగా .. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టుగా వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని అంది.
తాను నితిన్ సినిమాలను మాత్రమే చేస్తానంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ చిత్ర నిర్మాతలు లై సమయంలోనే తనని అప్రోచ్ అయ్యారని.. డేట్లు అడ్జస్ట్ చేయాలని కోరటంతో ఈ చిత్రాన్ని అంగీకరించానని వెల్లడించింది. తనకి నితిన్ మంచి స్నేహితుడనీ .. అంతకుమించి ఏమీ లేదనీ, ఇలాంటి ప్రచారాలు మానుకోవడం మంచిదంటూ గట్టిగానే చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Feb 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ... Read more
Feb 18 | వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల... Read more
Feb 18 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల... Read more
Feb 16 | బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది... Read more
Feb 15 | మెగాప్యామిలీ నుంచి తాజాగా ఉప్పెన చిత్రంతో తెరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా.. కరోనా తరువాత బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సందడి చేస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి... Read more