NBK's 102 First Look & Release Date Fixed | బాలయ్య జయ సింహా.. మోషన్ పోస్టర్ తేదీ రిలీజ్

Balayya new movie motion poster date

Nandamuri Balakrishna, Nandamuri Balakrishna Motion Poster, Nandamuri Balakrishna Jaya Simha, Jaya Simha Motion Poster, Balayya 102 Movie Motion Poster

Nandamuri Balakrishna 102 Movie First look Release date Announced. on November 1st Movie's Motion poster Out.

బాలయ్య మోషన్ పోస్టర్ తేదీ రిలీజ్

Posted: 10/28/2017 12:26 PM IST
Balayya new movie motion poster date

అగ్ర హీరో బాలకృష్ణ 102వ సినిమాగా కేఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి 'జై సింహ' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. సింహ'తో ముడిపడిన బాలకృష్ణ సినిమాలన్నీ కూడా భారీ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం వైజాగ్ లో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఆ సెంటిమెంట్ తోనే ఈ సినిమాకి ఈ టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.

బాలయ్య మూవీ లాంఛ్ ఫోటోలు

ఈ సినిమా నుంచి వచ్చేనెల 1వ తేదీన టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే బాలకృష్ణ అభిమానులు ఈ సినిమాలో ఆయన లుక్ ఎలా వుంటుందనే విషయంలో ఆసక్తిగా వున్నారు. మోషన్ పోస్టర్ రాకతో ఆ సస్పెన్స్ కి తెరపడనుంది.

బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. సో... ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో మరో పోటీ తప్పదన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles