Baahubali 2 Record in Bollywood for 2017 | డార్లింగ్ దరిదాపుల్లో కూడా లేరు

Baahubali 2 record in bollywood

Baahubali 2, Baahubali 2 Hindi Records, Baahubali 2 Bollywood, Baahubali 2 Rare Record, Baahubali 2 2017 Movies, Baahubali 2 Bollywood 2017 Movies, Baahubali 2 Record

Baahubali 2 Record in Bollywood. Prabhas-Rajamouli movie stands tall as the highest grosser of Bollywood with Rs. 511 crore lifetime collections for the Hindi version. The next movie in the list which happens to be ‘Judwaa 2’ featuring young hero Varun Dhawan is Rs. 373 crore away from ‘Baahubali2’.

బాహుబలి-2 .. ఈ యేడాది బాలీవుడ్ లో తోపు

Posted: 10/28/2017 11:17 AM IST
Baahubali 2 record in bollywood

ఓ ప్రాంతీయ చిత్రం.. పైగా సౌత్ నుంచి వెళ్లింది. హిందీలో డబ్ అయ్యింది. మొదటి పార్ట్ క్రియేట్ చేసిన మ్యాజిక్ తో అంచనాలు భారీగానే ఉన్నాయి. కట్ చేస్తే ఇండియాలో అత్యధిక వసూళ్ల సినిమా. ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే కొన్ని రెట్ల వసూళ్లు సాధించి..డిస్ట్రిబ్యూటర్లకు లాబాల పంట సాధించింది. అన్నింటికి మించి సౌత్ నుంచి ఓ సినిమా 5 సెంచరీల క్లబ్ లో జాయిన్ అయ్యి... బాలీవుడ్ చిత్రాలకు కూడా సాధ్యం కానీ ఫీట్ సొంతం చేసుకుంది.

ఇదంతా బాహుబలి ది కంక్లూజన్ గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం తర్వాత విడుదలైన పెద్ద హీరోల చిత్రాలపై దీని ప్రభావం చాలా చూపించినట్లు ఉంది. అందుకే సినిమా దరిదాపుల్లో కూడా ఏ చిత్రం లేకుండా పోయింది. ఈ యేడాది ఇప్పటిదాకా విడుదలై వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాను ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థ విడుదల చేసింది.

ఈ జాబితాలో 511 కోట్ల వసూళ్లతో(కేవలం హిందీ వర్షన్) బాహుబలి 2 తొలిస్థానంలో ఉండగా.. జుడ్వా 2(138 కోట్లు- గ్రాస్ 373 కోట్లు), రయిస్ (137 కోట్లు), టాయ్ లెట్-ఏక్ ప్రేమ్ కథ(134 కోట్లు) ఉన్నాయి. వీటి తర్వాత గోల్ మాల్ అగెయిన్.. ట్యూబ్ లైట్, జాలీ ఎల్ఎల్బీ 2, బద్రీనాథ్ కీ దుల్హనియా, కాబిల్, బాద్ షాహో నిలిచాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. టాప్ మూడు చిత్రాల టోటల్ కలెక్షన్లు కలిపి కూడా బాహుబలి 2 అంత రాబట్టలేకపోవటం గమనార్హం.

Baahubali 2 Top in 2017 Bollywood Movies

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles