Akshay Kumar Praises South Film Industry at 2.0 Launch | సౌత్ సినిమా ఇండస్ట్రీపై అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Akshay kumar on south industry

Akshay Kumar Praise South Film Industry, Akki Praise South Films, Akshay Kumar about South Dedications, Akshay Kumar Speech at 2.0 Audio Launch

Bollywood Actor Akshay Kumar Praises South Film Industry. Handwork encouragement and respect each other in industry he added.

సౌత్ సినిమాలపై అక్షయ్ ప్రశంసలు

Posted: 10/28/2017 09:48 AM IST
Akshay kumar on south industry

సౌత్ సినిమాలపై ఉత్తరాది వారికి ఓ చిన్న చూపు ఉంటుందన్నది తరచూ వారి నుంచి వచ్చే కామెంట్లను బట్టి అర్థమౌతుంది. బాహుబలి టైంలో ఖాన్ త్రయం ప్రకటనలు దానికి ఉదాహరణలు కాగా, బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్ హీనమైన వ్యాఖ్యలు ఇప్పుడు దానికి మరింత ఆజ్యం పోశాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ బుల్లితెర నటిని దుమ్మెత్తి పోస్తున్నారు.

అయితే ఏ అంశం గురించైనా ఓపెన్ గా మాట్లాడే అక్షయ్ కుమార్ గత రాత్రి దుబాయ్ లో జరిగిన 2.0 చిత్ర ఆడియో వేడుకలో చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా ఆసక్తికరంగా మారాయి.‘‘ నేను ఇప్పటిదాకా 130 చిత్రాలు చేశా. ప్రతీ దాని నుంచి ఎంతో కొంత నేర్చుకున్నా. కానీ, 2.0 చిత్రం నుంచి చాలానే నేర్చుకున్నానని గర్వంగా చెబుతున్నా. దక్షిణాది చిత్రాల నుంచి చాలా నేర్చుకోవచ్చు. అక్కడి టెక్నిషియన్లు చాలా కష్టపడుతుంటారు. ఒకరినోకరి టాలెంట్ ను గౌరవిస్తూ ప్రోత్సహిస్తుంటారు. అది తప్పక నేర్చుకోవాల్సిన విషయం అని పేర్కొన్నాడు.

దక్షిణ చిత్రాలను పొగరతో చులకన చేసే స్టార్లను ఇంతదాకా మనం చూశాం. అలాంటి సమయంలో ఓ స్టార్ హీరో అయిన అక్షయ్.. ఖుల్లగా చేసిన ఈ వ్యాఖ్యలు వారంతా చెవికెక్కించుకుంటారని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles