Dil Raju will produce Karithkeya Sequel | కార్తీకేయ సీక్వెల్.... దిల్ రాజు-నిఖిల్-

Karthikeya sequel coming soon

Dil Raju, Dil Raju Nikhil Movie, Dil Raju Karthikeya, Karthikeya Sequel, Karthikeya Dil Raju, Karthikeya Sequel Producer, Nikhil Siddarth Dil Raju

Dil Raju locked Nikhil for the first time in his career. Chandoo Mondeti who directed Nikhil in Karthikeya is all set to direct the young actor and the film will start rolling next year.

దిల్ రాజు నిర్మాతగా కార్తీకేయ సీక్వెల్?

Posted: 10/20/2017 04:33 PM IST
Karthikeya sequel coming soon

వరుస హిట్లతో ఊపు మీద ఉన్న యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఒకడు. అల్లరి చిల్లరి పాత్రలకు పుల్ స్టాప్ పెట్టి... వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హిట్లు సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కన్నడ హిట్ మూవీ కిరిక్ పార్టీ రీమేక్ తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఓ క్రేజీ కాంబోలో నిఖిల్ భాగం కాబోతున్నాడు.

దిల్ రాజు నిర్మాతగా చందూ మొండేటి డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుందంట. అది కార్తీకేయ సీక్వెల్ అని చెప్పుకుంటున్నారు. నిఖిల్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో ఒకటిగా 'కార్తికేయ' కనిపిస్తుంది. చందు దర్శకత్వంలోనే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే కోరిక ఇటు నిఖిల్ కి .. అటు చందూ మొండేటికి కూడా వుంది. కానీ అందుకు పరిస్థితులు కలిసి రాలేదు.

ఈ ఇద్దరితో ఒక సినిమా చేయడానికి దిల్ రాజు రెడీగా ఉన్నారనేది తాజా సమాచారం. ప్రస్తుతం చైతూతో చందూ మొండేటి 'సవ్యసాచి' చేయబోతున్నాడు. అయితే మధ్యలో మారుతితో నాగ చైతన్య ఓ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చందూ లేట్ అయితే నిఖిల్ ప్రాజెక్ట్ ముందుగానే తెరకెక్కే ఛాన్స్ ఉంది. అయితే అది కార్తీకేయ సీక్వెల్ అవునా? కాదా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles