Ram and Vijay Movies Release on Same Date | రామ్ కు ఇది ఊహించని ట్విస్ట్..

Ram movie competition

Hero Ram, Unnadi Okkate Jindagi Movie, Adirindi Movie, Vijay, Vijay Versus Ram, Ram Movie Adirindi, Unnadi Okkate Jindagi Adirindi

Ram Movie may tough competition with Vijay Movie. Unnadi Okkate Jindagi and Adirindi release on same date.

రామ్ చిత్రానికి పోటీ ఉంది

Posted: 10/20/2017 04:00 PM IST
Ram movie competition

ఎనర్జిటిక్ హీరో హైపర్ వంటి డిజాస్టర్ తర్వాత తిరిగి ఉన్నది ఒకటే జిందగీతో త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. నేను శైలజ వంటి సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత హిట్ కొట్టిన రామ్ మరోసారి దర్శకుడు కిషోర్ తిరుమలతో లక్ పరీక్షించుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ కి పోటీ తప్పదనే సంకేతాలు అందుతున్నాయి.

ఎప్పటి నుంచో రామ్ సోలో రిలీజ్ గా రావాలని భావించాడు. అందుకే ఈ నెల 27న ఉన్నది ఒక్కటే జిందగీ రిలీజ్ కోసం రెడీ అయ్యాడు. అయితే అదే రోజు మరో సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మెర్సల్ సినిమా 18వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. మిక్స్ డ్ టాక్ అయినా భారీ వసూళ్లతో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను తెలుగులో 'అదిరింది' పేరుతో ఈ సినిమాను అదే రోజున విడుదల చేయాలని శరత్ మరార్ ప్రయత్నించినా కుదరలేదు.

దీంతో ఈ వారం మొత్తం భారీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించి, ఓ వారం రోజుల తరువాతనే విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడు.రామ్ సినిమా వసూళ్లపై విజయ్ ప్రభావం ఏ స్థాయిలో వుంటుందో చూడాలి.

మెర్సల్ పై విమర్శలు...

త‌మిళ‌నాడులో క‌లెక్ష‌న్ల రికార్డుల‌ను తిర‌గ‌రాస్తున్న విజ‌య్ `మెర్స‌ల్‌` చిత్రం మీద త‌మిళ బీజేపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ విధానాల‌ను కించ‌ప‌రుస్తోంద‌ని వారు ఆరోపిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌లైన `మెర్స‌ల్‌` చిత్రంలో మోదీ ప్ర‌వేశ‌పెట్టిన‌ వ‌స్తు సేవ‌ల ప‌న్ను, డిజిట‌ల్ ఇండియా ప్ర‌చారాల‌ను త‌ప్పుగా చూపించిన‌ట్లు తెలుస్తోంది.

Vijay Adirindi Release Date

కొన్ని స‌న్నివేశాల కార‌ణంగా మోదీ భావ‌జాలాన్ని ప్ర‌జలు త‌ప్పుగా అర్థం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని త‌మిళ‌నాడు రాష్ట్ర బీజేపీ నాయ‌కుడు టీఎన్ సుంద‌ర‌రాజ‌న్ పేర్కొన్నారు. అలాంటి స‌న్నివేశాల‌ను తొల‌గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. మ‌రోపక్క `మెర్స‌ల్‌` చిత్రంలో భార‌త్‌, సింగ‌పూర్ దేశాల‌ను పోల్చుతూ విజ‌య్ పాత్ర చెప్పిన డైలాగులు త‌ప్పుడుత‌డ‌క‌లుగా ఉన్నాయ‌ని బీజేపీ యూత్ వింగ్ నేత ఎస్‌జీ సూర్య ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. 7 శాతం జీఎస్టీ అమ‌ల్లో ఉన్న సింగ‌పూర్‌లో ప్ర‌జ‌ల‌కు ఉచిత వైద్య‌స‌హాయం అందుతుంద‌ని, అదే 28 శాతం జీఎస్‌టీ క‌డుతున్నప్ప‌టికీ భార‌తీయుల‌కు ఎలాంటి సౌక‌ర్యాలు అంద‌డం లేద‌ని సినిమాలో ఓ స‌న్నివేశంలో విజ‌య్ డైలాగ్ చెబుతాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles