Renu Desai Again Comments on Second Marriage | రేణూ దేశాయ్ మళ్లీ రెండో పెళ్లి కామెంట్లు..

Renu desai second marriage comments

Renu Desai, Second Marriage Comments, Renu Desai, Pawan Kalyan Ex Wife, Pawan Marriages, Renu Desai again Love, Renu Desai Sensational Comments, Denu Desai Neethone Dance

Renu Desai again comments on Second Marriage in a TV Show. Pawan Ex Wife Excited after A couple Performance and said it.

మళ్లీ రెండో పెళ్లి గురించి రేణూ దేశాయ్

Posted: 10/18/2017 04:02 PM IST
Renu desai second marriage comments

ఈ మధ్యే నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లి కామెంట్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడగా.. కొందరు సెలబ్రిటీలు రేణూకి మద్దతుగా నిలిచారు. అంతేకాదు కామెంట్లు చేసిన వారికి గట్టి రిటార్ట్ ఇచ్చింది రేణూ. అయితే మళ్లీ ఇప్పుడు ఆమె రెండో పెళ్లి గురించి ప్రస్తావించటం విశేషం.

న‌టి, ప్రొడ్యూస‌ర్ రేణూ దేశాయ్ స్టార్ ఓ ఛానెల్ డాన్స్ షోలో జ‌డ్జిగా వ్యవహరిస్తున్నా విష‌యం తెలిసిందే. ఈ డ్యాన్స్‌షోలో ఆమే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. వ‌చ్చే శ‌ని, ఆదివారాల్లో రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతోన్న ఈ షోకి సంబంధించిన ప్రొమోను త‌మ అఫీషియల్ ట్విట్ట‌ర్ ఖాతాలో ఉంచింది. చక్రవాకం ఫేమ్ ఇంద్ర అతని భార్య చేసిన చేసిన డ్యాన్స్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన రేణూ దేశాయ్‌.. ఆ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు అందరితో క‌న్నీరు పెట్టిస్తున్నాయి.

‘నిజానికి నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది.. ఇప్పుడు మరోసారి నేను ప్రేమతో ప్రేమలో పడ్డాను.. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాల‌నుకుంటానో అప్పుడు మిమ్మ‌ల్ని త‌ప్ప‌కుండా పిలుస్తా’ అని ఆమె క‌న్నీరు పెట్టుకుంటూ ఆ జంట‌కు చెప్పింది. మరి ఈ వ్యాఖ్యలపై మళ్లీ ఎలాంటి రియాక్షన్ పడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles