Ram Charan Boyapati Movie Almost Confirmed | కొరటాల జిజీ.. బాలయ్య సారీ.. ఇక చెర్రీతోనే మూవీ

Ram charan upcoming details

Ram Charan, Boyapati, Ram Charan Boyapati, Cherry Boyapati, Ram Charan Boyapati Movie, Ram Charan Rangasthalama Movie

Ram Charan movie with Boyapati Sinu Movie almost Confirmed.

రాం చరణ్-బోయపాటి మూవీ.. డిసెంబర్ నుంచి?

Posted: 10/18/2017 02:36 PM IST
Ram charan upcoming details

మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే జెట్ స్పీడ్ తో షెడ్యూల్స్ పూర్తి చేస్తున్న సుకుమార్ టేకింగ్ మూలంగా సినిమా ఆలస్యం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా కూడా సమ్మర్ కు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా బోయపాటి .. చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు ఓ వార్త షికారు చేస్తోంది. అయితే ఇందులో వాస్తవమెంతన్నది తెలియక అభిమానులు అయోమయానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో .. ఈ కాంబినేషన్ సెట్ అయిన విషయం నిజమేనని తెలుస్తోంది. నిజానికి బాలకృష్ణతో బోయపాటి ఓ చిత్రం చేయవలసి వుంది. కానీ బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ సినిమాతో బిజీ. ఆ తరువాత సినిమాను ఆయన పూరీతో చేయనున్నాడు.

చెర్రీ కూడా'రంగస్థలం' తరువాత సినిమాను కొరటాలతో చేయాలనుకున్నాడు. కానీ ఆయన 'భరత్ అను నేను' మూవీతో బిజీగా వున్నాడు. అది సమ్మర్ లో రిలీజ్ కానుంది. అందువల్ల ఈ ఐదు నెలలు ఖాళీగా ఉండటం కంటే.. గ్యాప్ లో సినిమాను పూర్తి చేయాలని ఈ ఇద్దరు భావిస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను లాంచ్ చేసి .. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది దసరాకి ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేసుకుంటున్నారని టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles