Robo 2.0 Visual Effects Expenditure | బడ్జెట్ 450 కోట్లు.. జస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కోసమే అంతా?

2 0 visual effects budget

Rajinikanth Robo 2.0 Movie, 2.0 Visual Effects, 2.0 VF Effects, Shankar 2.0 Visual Effects, Director Shankar, Shankar 2.0 Movie, Shankar Visual Effects

Rajinikanth Robo 2.0 Movie Visual Effects Budget Shocks Every one. Shankar Spent only 100 Crores to 2.0.

వంద కోట్లతో 2.0 .. విజువల్ ఎఫెక్ట్స్

Posted: 10/18/2017 12:38 PM IST
2 0 visual effects budget

కొన్నేళ్ల క్రితం దాకా సౌత్ ఇండియన్ మూవీస్ లో శంకర్ ను బీట్ చేసే వాళ్లు లేరనే అంతా అనుకున్నారు. అయితే అప్పటిదాకా టాలీవుడ్ జనాల దృష్టిలోనే తోపుగా ఉన్న రాజమౌళి బాహుబలితో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. అది అలా ఇలా కాదు. ఏకంగా శంకర్ ను మించిపోయి.. అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీని సాధించేశాడు. ఆ క్రమంలో ఎవరూ బద్ధలు కొట్టలేని రికార్డులను కూడా జక్కన్న నెలకొల్పాడు. అదే వేరే విషయమనుకోండి.

అయితే ఇప్పటిదాకా విజువల్ ఎఫెక్ట్స్ కోసం అత్యధికంగా ఖర్చు చేసిన సినిమాగా ‘బాహుబలి’ పేరిటే ఓ రికార్డు ఉంది. సుమారు 100 కోట్లతో రెండు పార్ట్స్ గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేశారని చెబుతుంటారు.మరి ఇప్పుడు 2.0 ఆ అంచనాలను దాటిందనే విశ్లేకులు చెబుతున్నారు. 2.0 సాంకేతికత కోసం విదేశాల నుంచి నిపుణులను తెప్పించటంతోపాటు.. త్రీడీ సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నాడు. మొత్తం మీద ఇప్పటిదాకా సుమారు రూ.100 కోట్ల దాకా ఖర్చయిందన్నది ఓ అంచనా.

అయితే ఈ క్రమంలో నిర్మాణ సంస్థ లైకాతో చాలా రిస్క్ చేయిస్తున్నాడనే వాదన కూడా ఉంది. ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ రేంజ్ లో ఈ బడ్జెట్ ఉండబోతుందంట. అంటే రూ.450 కోట్ల బడ్జెట్ లో కేవలం 100 కోట్లు గ్రాఫిక్స్ కోసమేనంట. ఈ నెల 27న దుబాయ్ లో ఆడియో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా.. వచ్చే ఏడాది జనవరి 25న ‘2.0’రిలీజ్ కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles