PSV Garuda Vega trailer Stylish and impressive | పీఎస్వీ గరుడ వేగ ట్రైలర్.. స్టైలిష్ అండ్ రిచ్.. మరి కంటెంట్?

Garuda vega trailer

Rajasekhar, Praveen Sattaru, PSV Garuda Vega Movie, PSV Garuda Vega Trailer, PSV Garuda Vega Trailer Review, PSV Garuda Vega Trailer Talk, Balayya Speech at PSV Garuda, Balakrishna Speech at PSV Garuda Vega Trailer Launch, Rajasekhar Speech at PSV Garuda Vega Trailer

Rajasekhar-Praveen Sattaru’s ‘PSV Garuda Vega’ is here. After piquing our curiosity with the first look and teaser, the makers have released this trailer on Tuesday (Oct 17). The trailer was launched by Nandamuri Balakrishna at a special event in Hyderabad.

పీఎస్వీ గరుడ వేగ ట్రైలర్.. స్టైలిష్ అండ్ రిచ్

Posted: 10/18/2017 09:23 AM IST
Garuda vega trailer

కనీసం సీనియర్ పాత్రలను కూడా ఒప్పుకోకుండా.. ఆ మధ్య హీరోగానే ట్రై చేసి బోల్తా పడ్డ సీనియర్ నటుడు రాజశేఖర్ ను ఇండస్ట్రీ దాదాపు మరిచిపోయినంత పనయ్యింది. అయితే చందమామ కథలు, గుంటూరు టాకీస్ లాంటి వైవిధ్యకరమైన చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రవీణ్ సత్తారు గరుడ వేగ అంటూ ఓ ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు.

సినిమా షూటింగ్ టైంలోనే ఇదోక భారీ బడ్జెట్ మూవీ అనగానే అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైగా నటుడు రాజశేఖరే ఈ చిత్రం కోసం నిర్మాతగా మారాడు. అయితే టీజర్ తో ఒక్కసారిగా అంచనాలు మార్చేసిన ఆయన.. ట్రైలర్ తో మరో అడుగు ముందుకేశాడు. హాలీవుడ్ తరహాలో భారీ చేజులున్న యాక్షన్ సినిమానే మనకు అందించినట్లు స్పష్టమౌతుంది. అగ్ర నటుడు బాలకృష్ణ చేతుల మీదుగా నిన్న ట్రైలర్ లాంఛ్ కాగా.. అది ఆకట్టుకుంటోంది.

సిన్సియర్ ఆఫీసర్ శేఖర్ రోల్ లో రాజశేఖర్ నటించగా.. అతని భార్యగా పూజా కుమార్.. అలీ, నాజర్, శ్రద్ధా దాస్ ఇలా ముఖ్యపాత్రలను పరిచయం చేశాడు. అన్నింటికన్నా ముఖ్యంగా కిషోర్ నెగటివ్ రోల్ హైలెట్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ట్రైలర్ క్వాలిటీ పరంగా అదిరిపోయింది.ఓ టెర్రర్ ఆపరేషన్ బేస్ మీద సినిమా నడిచే విధంగా ప్రవీణ్ సినిమాను రూపొందించినట్లు అర్థమౌతుంది. మాస్ కోసమే సన్నీ పాట పెట్టినట్లు చివర్లో చూపించేశారు. నవంబర్ 3న గరుడ వేగ రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles