First Look : Keerthy Suresh as iconic actress | ఫస్ట్ లుక్.. అచ్చం సావిత్రిమల్లే కీర్తి

Mahanati first look out

Keerthy Suresh, Savitri Movie, Mahanati First Look, Mahanati Savitri First Look, Keerthy Suresh Mahanati Savitri First Look, Keerthy Suresh Savitri First Look, Keerthy Suresh Mahanati First Look

First Look of Keerthy Suresh as iconic actress Savitri in ‘Mahanati’ will take you back to the yesteryears of South Indian cinema. The beautiful actress Savitri was one of the iconic actresses in South Indian cinema and has worked in numerous films in Telugu, Tamil, Kannada and Malayalam.

కీర్తి సురేశ్ బర్త్ డే.. మహానటి ఫస్ట్ లుక్

Posted: 10/17/2017 04:42 PM IST
Mahanati first look out

నటి కీర్తి సురేశ్ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా ‘మహానటి’ చిత్రంలో ఆమె పోషిస్తున్న సావిత్రి పాత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇప్పటికే అభిమానుల నుంచి శుభాకాంక్షలు, ప్రశంసలు అందుకున్న కీర్తి సురేశ్ పై మరో నటిసమంత తన శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేసింది. ‘ఆ కళ్లను ఎవ్వరూ దాచలేరు. ఆ కళ్లే మహానటి జీవిత చరిత్రను చెప్పబోతున్నాయి. కీర్తి సురేశ్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని తన ట్వీట్ లో పేర్కొంది.

ఆకాశ వీధిలో అందాల జాబిలి

ఇక చిత్ర యూనిట్`ఆకాశ వీధిలో అందాల జాబిలి` పేరుతో పుట్టినరోజు శుభాకాంక్ష‌లు చెబుతూ కీర్తి ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. కేవ‌లం కీర్తి క‌ళ్లు మాత్రమే క‌నిపిస్తున్న ఈ ఫస్ట్‌లుక్ చూస్తే అది సావిత్రి ఫొటోనా? లేక కీర్తి ఫొటోనా? అని తేల్చుకోవ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతోంది. దీన్ని బ‌ట్టి చూస్తే కీర్తి సురేశ్ ఆ పాత్ర‌లో ఎంతె‌లా ఒదిగిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు.

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో స‌మంత కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌, `అర్జున్ రెడ్డి` జంట విజ‌య్ దేవ‌రకొండ, షాలిని పాండేలు కూడా ఈ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి దుల్క‌ర్ స‌ల్మాన్ పోషిస్తున్న జెమినీ గ‌ణేష‌న్ పాత్ర ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh