Prabhas no Gap for Upcoming Movies | వాళ్లిద్దరూ చేసే తప్పులు ప్రభాస్ చేయడంట!

Prabhas back to back movies plan

Prabhas, NTR Mahesh Babu, Gap for Movies, Saaho Movie, Prabhas 2018 Movies, Prabhas Upcoming Movies

Prabhas Avoiding Tarak And Mahesh’s Mistakes like taking gap to movie to movie. There are two films of the star that are going to happen one by one without any break. It might look like a long break post-Baahubali 2, but Prabhas is making sure that he has two releases back to back to back again.

ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ ఎందుకంటే...

Posted: 10/06/2017 03:36 PM IST
Prabhas back to back movies plan

టాలీవుడ్ లో నంబర్ వన్ చెయిర్ గురించి పోటీ పరిస్థితి చాలా గందరగోళంగా మారిపోయింది. ఆశలు పెట్టుకున్న మహేష్, పవన్ లు వరుస డిజాస్టర్లతో అభిమానులను నిరాశపరుస్తుండటం.. మిగతా హీరోలు ఎప్పుడు హిట్లు కొడుతున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అలాంటి సమయంలో బాహుబలి తో ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ వైడ్ స్టార్ గా మారిపోయి అందరి కళ్లు తనవైపు తిప్పుకున్నాడు.

టాలీవుడ్ టాప్ హీరోల్లో ప్రభాస్ కూడా ఉన్నాడనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ సినిమా చేశామంటే చాలూ హమ్మాయ్యా... అనుకుంటూ రెస్ట్ తీసుకుంటారు కొందరు స్టార్లు. మహేష్, ఎన్టీఆర్ లు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. జై లవ కుశ, స్పైడర్ లు అనుకున్న స్థాయిలో ఆడకపోవటంతో ప్రస్తుతం ఆ ఇద్దరు హీరోలు ఫ్యామిలీస్ తో సహా ఫారిన్ కు చెక్కేశారు. కానీ, బహుబలి లాంటి బృహత్తర ప్రాజెక్టు తర్వాత చాలా తక్కువ విశ్రాంతి తీసుకున్న ప్రభాస్ సాహోతోపాటు కొత్త సినిమాను కూడా త్వరలో ప్రారభించేందుకు సిద్ధమైపోతున్నాడు.

వచ్చే ఏడాదిలో ప్రబాస్ సాహోతో పాటు కొత్త చిత్రం కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ చివరికల్లా సాహోలో మాగ్జిమమ్ పోర్షన్ షూటింగ్ ను అయిపోగొట్టి.. జనవరి నుంచి కొత్త చిత్రం షూటింగ్ ను ప్రారంభించనున్నారంట. రెండో ఏడాది ద్వితియార్థంలో దాదాపు ఐదారు నెలల గ్యాప్ లోనే రెండు చిత్రాలను రిలీజ్ చేయబోతున్నాడు. తద్వారా ఒకటి కాకపోయినా మరోకటి హిట్ అవ్వొచ్చనేది ప్రభాస్ ఐడియా అయి ఉంటుందని చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  2018 Movies  ప్రభాస్  2018 సినిమాలు  

Other Articles