Rakul again team up with Mahesh babu | మహేష్ 25.. రకుల్ నే తీసుకున్నారా?

Rakul again with mahesh babu

Rakul Preet Singh, Mahesh Babu, Spyder pair, Vamsi paidipally, Mahesh Babu 25th Movie

Rakul Preet Singh again team up with Super Star Mahesh Babu. Mahesh 25th Movie with Vamshi Paidipally prefers Rakul.

మరోసారి మహేష్ తో రకుల్?

Posted: 10/05/2017 07:08 PM IST
Rakul again with mahesh babu

రకుల్ ఇప్పుడు సౌత్ లాంగ్వేజ్ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఓవైపు తెలుగులో.. మరో పక్క తమిళ్ లో... ఇంకోవైపు బాలీవుడ్ లో ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది. ప్రస్తుతం కోటికి పైగా పారితోషికం తీసుకుంటున్న రకుల్, తమిళంలో మాత్రం రెండు కోట్లు డిమాండ్ చేస్తోందట.

అయినప్పటికీ తమ సినిమాల్లో ఆమెను ఖరారు చేసుకోవడానికి దర్శక నిర్మాతలు వెనుకాడటం లేదని అంటున్నారు.ఇదిలా ఉంటే మరోసారి మహేశ్ తో జోడీ కట్టే అవకాశం ఆమెకు దక్కిందన్న వార్త షికారు చేస్తోంది. మహేష్ 25వ చిత్రం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో అన్న విషయం తెలిసిందే. ఇందులో రకుల్ నే ఫైనల్ చయబోతున్నారని టాక్.

మహేశ్ - రకుల్ కాంబినేషన్లో వచ్చిన 'స్పైడర్' భారీ విజయాన్ని సొంతం చేసుకోకపోయినా, ఈ జోడీ బాగుందనే టాక్ వచ్చింది. రకుల్ హార్డ్ వర్క్ ను మహేష్ మెచ్చుకున్నాడు కూడా. దీంతో ఆమె ఎంపిక ఖాయమైందనే అంటున్నారు. ఏది ఏమైనా సినిమా సెట్స్ మీదకు వెళ్లే వరకు ఏ విషయంపై ఓ స్పష్టత లేకుండా పోతుంది. ఈ తరుణంలో రకుల్ ఎంపికైన వార్త అఫీషియల్ గా కన్పర్మ్ అయ్యేదాకా ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles