Actress Hema fire on websites vulgar content on cine stars | పిచ్చి రాతలపై నటి హేమ అభిప్రాయం

Actress hema on websites issue

Movie Artist Association, Actress Hema, Vulgar Content, Websites, Morphing Photos, Tollywood, Cyber Crime Police

Tollywood Actress Hema Fire on Websites. Almost 60 Websites belongs to Hyderabad Posted vulgar content on cine stars.

వెబ్ సైట్ల వ్యవహారంపై నటి హేమ ఫైర్

Posted: 10/05/2017 06:28 PM IST
Actress hema on websites issue

తమ వ్యూవ్స్ పెంచుకోవటానికి అర్థం పర్థం లేని హెడ్డింగులు.. మార్పింగ్ ఫోటోలు.. అన్నింటికీ మించి బూతును వాడుకుంటున్నారని నటి, మా కార్యదర్శి హేమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

త‌మ‌ భార్యాపిల్ల‌ల్ని పోషించుకోవ‌డానికి వెబ్‌సైట్ల నిర్వాహ‌కులు బూతును ఆశ్రయిస్తున్నారని ఆమె అన్నారు. న‌టుల‌పై వ‌స్తోన్న గాసిప్స్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన హేమ‌... ఫేస్‌బుక్‌లో మార్ఫింగ్ చేసి ఫొటోలు పెట్ట‌డం వ‌ల్ల అమ్మాయిలు ఆత్మ‌హ‌త్యలు చేసుకుంటున్నార‌ని అన్నారు. త‌న బాధ సినీన‌టుల గురించి మాత్రమే కాద‌ని, అంద‌రు ఆడ‌వాళ్ల గురించ‌ని తెలిపారు.

ఎక్కడెక్కడో ఉండి వెబ్‌సైట్ నిర్వాహ‌కులు వాటిని నిర్వ‌హిస్తుంటారని, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను బజారుకీడుస్తున్నారని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు.‘ఒళ్లు కొవ్వెక్కిందా వాళ్లకి? ఇంటువంటి రాత‌లు రాస్తున్నారు’ అని ప్ర‌శ్నించారు. చదువుకి సంబంధించిన వాటిని గూగుల్‌లో సెర్చ్ చేస్తే దాని ప‌క్కన ఇది క్లిక్ చేయండంటూ అశ్లీల వీడియోలు, రాత‌లు ఉంటున్నాయ‌ని ఆమె తెలిపారు. మొత్తం 150 సైట్లలో నగరానికి చెందిన 60 సైట్లను గుర్తించామని, త్వరలో వాటిపై చర్యలు తీసుకునేలా సైబర్ క్రైమ్ అధికారులకు తాము ఫిర్యాదు చేశామని హేమ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MAA  Actress Hema  టాలీవుడ్ మా  నటి హేమ  

Other Articles