Jai Lava Kusa box office collections day 2 త్రిపాత్రాభినయంతో రికార్డులను తిరగాస్తున్న యంగ్ టైగర్

Jai lava kusa box office collections day 2

jai lava kusa, jr ntr, jai lava kusa collections, jai lava kusa collection, jai lava kusa earnings, jai lava kusa earning, jai lava kusa box office, jai lava kusa bo, jai lava kusa day 1, nivetha thomas, jr nrt movie, jr ntr new movie, jr ntr movie update, jr ntr movie news, ntr

Jr NTR movie performed extraordinarily and managed to mint Rs 47.25 crore worldwide. This is second only to the massive success of Baahubali franchise.

త్రిపాత్రాభినయంతో రికార్డులను తిరగాస్తున్న యంగ్ టైగర్

Posted: 09/23/2017 12:00 PM IST
Jai lava kusa box office collections day 2

దసరా పండగను పురస్కరించుకుని ప్రేక్షక దేవుళ్ల ముందుకు వచ్చిన.. నందమూరి నటవారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం 'జై లవ కుశ' వారి అభిమానాన్ని చూరగొంటుంది. ఈ విషయాన్ని గత రెండు రోజులుగా వచ్చిన కలెక్షన్ల వివరాలే స్పష్టం చేస్తున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే యాభై కోట్ల క్లబ్ లో చేరి.. 100 కోట్ల క్లబ్ లోకి దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగా అధరిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నందమూరి నటనతో మొప్పించాడని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టి నూతన చరిత్రను లిఖిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 21.86 కోట్ల షేర్ ను సాధించి, 32 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా, అది కాస్తా రెండు రోజుకు ఏకంగా రూ. 80 కోట్ల గ్రాస్ కు చేరింది. అయితే ఇది ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గ్రాస్ అని సీనీవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే ఒరవడి కొనసాగిస్తే కేవలం వారం రోజుల వ్యవధిలో ఈ చిత్రం రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ ను సాధిస్తుందని సినీ విశ్లేషకుల అంచనా.

తొలి సారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయడం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. ఈ మూడు పాత్రల మధ్య గల వేరియేషన్స్ ను ఎన్టీఆర్ అద్భుతంగా పండించడం ..  ఆ పాత్రల స్వభావాలను దృష్టిలో పెట్టుకుని దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ ను కంపోజ్ చేయడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చిందని అంటున్నారు. శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింత ఊపందుకోవడం ఖాయమని దీంతో తొలివారంలోనే రూ.200 క్లబ్ లో చేరిన నాన్ బాహుబలి చిత్రంగా ఈ సినిమా నిలిచిపోతుందని టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles