SJ Suriya Good Bye to Direction Department | ఖుషీ డైరక్టర్ ఇక ఆ పని చేయబోడంట!

Sj suriya sensational decision

SJ Suriya, Director SJ Suriya, Suriya New Movie, SJ Suriya Director, SJ SUriya SPYder and Mersal

Director SJ Suriya Good Bye to Direction Department. He wants to Continue as Director itself. Now He actred negative roles in SPYder and Mersal.

సూర్య ఇక డైరెక్షన్ కి గుడ్ బై

Posted: 09/22/2017 07:07 PM IST
Sj suriya sensational decision

సుమారు 15 ఏళ్ల క్రితం సౌత్ సినిమాల్లో ఎస్ జే సూర్య అనే పేరు ఓ సంచలనం. కెరీర్ బిగినింగ్ లోనే వాలి లాంటి డేరింగ్ కాన్సెప్ట్ తీసి.. ఆపై పవన్ తో తెలుగులో ఖుషీగా బ్లాక్ బస్టర్ అందించిన సూర్య తర్వాత కొన్నేళ్లపాటు అగ్ర దర్శకుల జాబితాలో కొనసాగాడు. అయితే వరుస డిజాస్టర్లు ఆయన్ను పాతాళానికి పడదోశాయి.

బీ గ్రేడ్ తరహా సినిమాలు తీస్తున్నాడంటూ మధ్యలో విమర్శలు కూడా వినిపించాయి. మధ్య లో మధ్యలో నటిస్తూ వస్తున్న అవి అంతగా ఆడకపోవటంతో.. ఆ మధ్య పవన్ తో సినిమా అనౌన్స్ అయ్యి అది వేరే వాళ్ల చేతికి వెళ్లిపోవటంతో... సూర్య ఇక తెరపై కనిపించటం దాదాపు కష్టమే అని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయన కెరీర్ ఇప్పుడు టర్న్ అయిపోయింది. తనలోని నటుడికి పూర్తి స్థాయి పని చెబుతున్నాడు. 'ఇరైవి' సినిమా నటుడిగా ఆయన ప్రతిభను చాటి చెప్పింది. అప్పటి నుంచి వచ్చిన అవకాశాలను వదలుకోవటం లేదు.

రీసెంట్ గా ఆయన మహేశ్ బాబు 'స్పైడర్' లోను .. విజయ్ 'మెర్సెల్' లోను విలన్ గా చేస్తున్నాడు. స్పైడర్ ప్రీ రిలీజ్ పంక్షన్ లోనూ మెగాఫోన్ పట్టుకోవాలనుకోవడం లేదంటూ చెప్పాడు. తాజాగా చిత్ర ప్రమోషన్ ఇంటర్వ్యూలలో కూడా ఇదే స్పష్టం చేశాడు. నిజానికి నటుడిని కావాలనే తాను ఇండస్ట్రీకి వచ్చాననీ .. కొన్ని పరిస్థితుల్లో దర్శకుడిగా మారానని అన్నాడు. దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాక నటుడిగా మారే ఛాన్స్ వచ్చిందని చెప్పాడు. తనలోని దర్శకుడికి విశ్రాంతినిచ్చి, నటుడిగానే ముందుకు వెళ్లాలనుకుంటున్నాడంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SJ Suriya  ఎస్ జే సూర్య  

Other Articles