A biopic on Woman Indian Cricketer announced | ఇండియన్ ఫిమేల్ బౌలర్ సినిమా? హీరోయిన్ ఎవరు?

Biopic has been finalised on female cricketer

Jhulan Goswami, Indian Woman Cricketer, Woman Bowler Biopic, Jhulan Goswami Biopic, Chakdah Express Movie, Chakdah Express 2018, Chakdah Express Director, Chakdah Express Actress, Chakdah Express Heroine

A Biopic Has Been Finalised On Female Cricketer. Jhulan Goswami biopic to be titled as Chakdah Express.

భారత మహిళా క్రికెటర్ బయోపిక్ వస్తోంది

Posted: 09/19/2017 06:38 PM IST
Biopic has been finalised on female cricketer

బాలీవుడ్ లో బయోపిక్ లకు ఎప్పటికప్పుడు గిరాకీ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ సెలబ్రిటీల విషయంలో ఇది చాలా ఎక్కువ. అదే సమయంలో రసవత్తరంగా తెరకెక్కించకపోతే అజార్ సినిమాలాగా డిజాస్టర్ ఫలితం మాత్రమే మిగులుతుంది.

ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్క‌ర్ జీవిత క‌థ‌ల త‌ర‌హాలో ఇప్పుడు ఓ మ‌హిళా జ‌ట్టు క్రికెట‌ర్ జుల‌న్ గోస్వామి జీవిత క‌థ‌ను సినిమాగా తీయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వ‌న్డేల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన మ‌హిళా క్రికెట‌ర్‌గా జుల‌న్ రికార్డుల్లోక ఎక్కింది. ఆమె జీవిత‌గాథ‌ను బయోపిక్ గా తెరకెక్కించాలని లేడీ డైరక్టర్ సుశాంత దాస్ ప్రయత్నిస్తోంది.

`ఛ‌క్దాహా ఎక్స్‌ప్రెస్‌` పేరుతో రానున్న ఈ చిత్రంలో జుల‌న్ చిన్న‌త‌నం నుంచి ప్రారంభ‌మై ఇటీవ‌ల ప్ర‌పంచ క‌ప్‌లో త‌న ప్ర‌ద‌ర్శ‌న వ‌ర‌కు చూపించ‌నున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను 2018, ఏప్రిల్‌లో ప్రారంభించ‌నున్నారు. అయితే జుల‌న్ పాత్ర కోసం బాలీవుడ్ లో ఎవరిని సంప్రదించారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles