Baahubali Item Girls for Mohan Babu Gayathri Movie.

Baahubali girls in mohan babu movie

Mohan Babu, Director Madan, Baahubali Movie, Manohari Songs Actresses, Baahubali Item Song Girls Mohan Babu,, Gayatri Movie Item Song

Mohan Babu Brings Baahubali Girls for Gayatri Movie. Scarlet and Sneha Madhu Item Song in Gayatri Movie.

మోహన్ బాబు మూవీలో బాహుబలి ఐటెం గర్ల్స్

Posted: 09/15/2017 05:20 PM IST
Baahubali girls in mohan babu movie

డైలాగ్ కింగ్ మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తెర మీద సందడి చేయబోతున్నారు. మొన్నటిదాకా వారసుల చిత్రాల్లో జస్ట్ గెస్ట్ రోల్స్ తో సందడి చేసిన ఆయన పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో కాస్త లెంగ్తీ రోల్ చేశారు. అయితే అవేవీ సక్సెస్ కాలేపోయాయి.

ఇక ఇప్పుడు పెళ్లైన కొత్తలో చిత్ర దర్శకుడు మదన్ తో గాయత్రి అనే చిత్రం చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరన్నది ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా.. ఓ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గానే దీనిని తీయబోతున్నారని టాక్. టాలీవుడ్ యాంకర్ అనసూయ ఇందులో ఓ జర్నలిస్ట్ పాత్రలో నటించబోతుంది. ఇక ఇప్పడు ఈ సినిమాకు బాహుబలి హంగులు వచ్చి చేరింది. మనోహరీ.. పాటలో మెరిసిన స్కార్లెట్‌, మధు స్నేహల‌ను మోహ‌న్ బాబు సినిమాలోని ఓ ప్రత్యేక గీతంలో డ్యాన్స్ చేసేందుకు తీసుకున్నార‌ట‌.

కథలో ఈ పాటకు చాలా ప్రాధాన్యత ఉంటుందట‌. ఈ పాట కోసం తిరుపతిలో వేసిన ప్రత్యేక సెట్‌లో షూటింగ్ పూర్తయిందని తెలిసింది. అన్నట్లు ఈ సినిమాలో మంచు విష్ణు కూడా నటిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles