NTR Not yet Confirmed Srinivasa Kalyanam Story | ఎన్టీఆర్ జస్ట్ విన్నాడంతే.. రిజక్ట్ చేయలేదు!

Ntr family movie in discussions

NTR, Srinivasa Kalyanam Movie, Director Satish Vegesna, Dil Raju Srinivasa Kalyanam

NTR Not yet Confirmed Srinivasa Kalyanam. Satish Vegesna Not tell full story just few lines to NTR. After Jai Lava Kusa released NTR may Fix the Family Entertainer.

ఎన్టీఆర్-సతీశ్ వేగేశ్న.. శ్రీనివాస కళ్యాణం ఉందంట!

Posted: 09/15/2017 03:09 PM IST
Ntr family movie in discussions

జై లవ కుశతో ట్రిపుల్ మ్యాజిక్ అందించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమైపోతున్నాడు. ఇది అయిపోగానే విదేశీ టూర్ కు వెళ్లొచ్చి ఆపై త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడని టాక్. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమాకు ఒప్పుకోలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ యంగ్ డైరక్టర్ కు తారక్ పచ్చజెండా ఊపాడన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

శతమానం భవతితో ఫ్యామిలీ హిట్ అందుకున్న సతీశ్ వేగేశ్న ఎన్టీఆర్ కు ఓ స్టోరీ లైన వినిపించాడని తెలుస్తోంది. దిల్ రాజు .. సతీశ్ వేగేశ్న కాంబినేషన్ లోనే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడానికి వీళ్లిద్దరూ రంగంలోకి దిగారు. కథను బట్టి ఈ సినిమాకి 'శ్రీనివాస కళ్యాణం' అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ కి సతీశ్ వేగేశ్న వినిపించగా .. ఆయన పెద్దగా ఆసక్తిని కనబరచలేదనే టాక్ వచ్చింది. అదంతా కేవలం ప్రచారం మాత్రమేననేది తాజా సమాచారం.

దిల్ రాజు చూచాయగా కొన్ని లైన్స్ మాత్రమే ఎన్టీఆర్ కి చెప్పారట. ఆసక్తిని వ్యక్తం చేసిన ఎన్టీఆర్ .. 'జై లవ కుశ' రిలీజ్ తరువాత పూర్తి కథను వింటానని అన్నాడట. అప్పుడు కథ వినిపించడానికి సతీశ్ వేగేశ్న సిద్ధమవుతున్నాడు. అయితే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేయడం అంత తేలికైన విషయం కాదు. రచయితగానే ఎక్కువ అనుభవాన్ని కలిగిన సతీశ్ వేగేశ్న ఆ ధైర్యం చేస్తాడేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles