Raashi Khanna Guest Role in Ravi Teja Movie | ఐటెంగా మారుతుందా? లేదా? క్లారిటీ మిస్సయ్యింది.

Raashi khanna guest role in raaja the great

Raashi Khanna, Raaja The Great Movie, Raviteja, Special Role, Raashi Khanna Guest Appearance, Raashi Khanna Item Song

Raashi Khanna to make special appearance in Raviteja's Raaja The Great. But, No Clarity whether Raashi doing Item Song or Not.

రాజా ది గ్రేట్ లో రాశీ గెస్ట్ రోల్

Posted: 09/14/2017 06:11 PM IST
Raashi khanna guest role in raaja the great

టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా ఇప్పుడు జై లవ కుశ రిజల్ట్ పై ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉంది. ఎందుకంటే ఈ చిత్రం హిట్ అయితేనే తర్వాత స్టార్ హీరోలతో చేసే ఛాన్స్ వస్తుందన్న ఆశతో ఉంది కాబట్టి. అయితే ఓవైపు హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు గెస్ట్ అప్పీయరన్స్ కు కూడా రాశీ సిద్ధమైనట్లు సమాచారం.

రవితేజతో 'టచ్ చేసి చూడు' .. వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' సినిమాల్లో ఆమె అవకాశాలను అందుకోగలిగింది. ఇంత బిజీలోనూ ఆమె తమిళంలో ఓ హర్రర్ చిత్రం .. మళయాళంలో అయితే ఏకంగా మోహన్ లాల్ చిత్రంలో నెగటివ్ రోల్ ఇలా వరుస చిత్రాలు చేసుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె 'రాజా ది గ్రేట్' సినిమాలో అతిథి పాత్రలో కనిపించనుందంట. ఈ విషయాన్ని ఆమెనే ఫేస్ బుక్ ద్వారా స్వయంగా తెలియజేసింది.

ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన అనిల్ రావిపూడి, 'సుప్రీమ్' సినిమాతో రాశి ఖన్నాకి హిట్ ఇచ్చాడు. అందువలన ఆయన గెస్టు రోల్ కోసం అడిగితే రాశి ఖన్నా కాదనలేకపోయిందట. తాను తెరపై కనిపించేది కాసేపే అయినా, ఆ ప్రభావం ఆడియన్స్ పై బాగానే ఉంటుందని చెబుతోంది. అయితే అది ఐటెం సాంగ్ అంటూ వస్తున్న వార్తలపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. రవితేజ బ్లైండ్ క్యారెక్టర్, మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న రాజా ది గ్రేట్ ఈ చిత్రం అక్టోబర్ రెండో వారంలో రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles