Jai Lava Kusa Glimpse and SPYder Trailer Release | ఎన్టీఆర్, మహేష్ లు ఒకే రోజు ట్రీట్లు.

Mahesh ntr trailer treats for upcoming movies

NTR, Swing Zara Item Song, Tamannah, Jai Lava Kusa Movie, Mahesh Babu, SPYder Movie, Trailer Launch, Pre Relase Event

Swing Zara Item Song Glimpse from Jai Lava Kusa release tomarrow. As Well as Mahesh Babu's Jai Lava Kusa Trailer also launch at Pre Release Function.

జై లవ కుశ, స్పైడర్.. ఒకే రోజు ట్రీట్లు

Posted: 09/14/2017 05:40 PM IST
Mahesh ntr trailer treats for upcoming movies

అఫ్ కోర్సు సెప్టెంబర్ చివరి వారాల్లో టాలీవుడ్ బిగ్ హీరోల మధ్య వార్ తప్పదనే చెప్పుకోవాలి. జై లవకుశతో ఎన్టీఆర్ సెప్టెంబర్ 21న బరిలో దిగుతుండగా, ఓ ఆరు రోజల తర్వాత మహేష్ బాబు స్పైడర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అంటే వారం వ్యవధిలో దసరా సందడి చేసేందుకు ఈ ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు రెడీ అయిపోతున్నారు.

ఇదిలా ఉంటే రేపు అంటే సెప్టెంబర్ 15న ఈ ఇద్దరు హీరోలు అభిమానుల కోసం ఓ ప్రత్యేక కానుక అందించబోతున్నారు. జై లవకుశలో పాటలకు యావరేజ్ మార్కులు పడిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో మాస్ అభిమానులకు ఉర్రూత లూగించేలా ఐటెం సాంగ్ ను యాడ్ చేయబోతున్నారు. స్వింగ్ జరా అనే సాంగ్ లో తమన్నాతో కలిసి జూనియర్ స్టెప్పులేయబోతున్నాడు. ఈ పాటకు సంబంధించిన ఓ సర్ ప్రైజ్ ను రేపు అందించబోతున్నారంట. అంటే పాటకు సంబంధించిన గ్లింప్స్ తరహాలో ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో తొలిసారి వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా జై లవ కుశ కొత్త రికార్డు క్రియేట్ చేసింది.

ఇక మహేష్ విషయాన్నికొస్తే ఎలాగూ రేపు హైదరాబాద్ శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ లోనే చిత్ర ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలా ఈ ఇద్దరు స్టార్ హీరోలు సినిమా రిలీజ్ కు ముందే తమ తమ అభిమానులకు సర్ ప్రైజ్ లు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles