Dileep Ramaleela Release Troubles Continues | లైంగిక దాడి కేసు.. దిలీప్ సినిమా రిలీజ్.. అసలు ఆడుతుందా?

Dileep movie in release troubles

Malayalam, Ramaleela Malayalam Movie, Ramaleela Movie Hero, Dileep Ramaleela Movie,

Malayalam Star Hero Dileep's Ramaleela's release date is September 28th. Recently it was rumoured that Ramaleela, will release on September 22. And now, the movie's director Arun Gopy has clarified that.

దిలీప్ చిత్రానికి రిలీజ్ ట్రబుల్స్

Posted: 09/14/2017 04:59 PM IST
Dileep movie in release troubles

వివాదాస్పద అంశాలున్న చిత్రం రిలీజ్ కే అడ్డంకులు ఎదురవుతున్న తరుణంలో.. అసలు ఆ హీరో పైనే లైంగిక వేధింపుల ఆరోపణలు ఉంటే ఇక ఈ చిత్రం పరిస్థితి ఎలా ఉంటుంది?. మాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ రామ్ లీలా చిత్రం ఎట్టకేలకు రిలీజ్ కు సిద్ధమైనప్పటికీ అది ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది.

మళయాళ స్టార్ హీరోయిన్ భావన కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో రెండు నెలల కిందట అరెస్టయిన దిలీప్ ఇంకా జైల్లోనే ఉన్నాడు. బెయిల్ కోసం ఇప్పటికే రెండుసార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, అది తిరస్కరణకు గురైంది. ప్రస్తుతం మూడోసారి బెయిల్ కోసం సీరియస్ గా యత్నిస్తున్నాడు. అది తన కంటే తన చిత్ర నిర్మాతలకే కీలకం కానుంది. కొన్ని నెలల కిందటే పనులన్నీ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో లైంగిక వేధింపుల కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లాడు. 13 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పై నిర్మాతల్లో బెంగ మొదలైంది.

అయితే ఈ నెల 22న సినిమా రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్త నేపథ్యంలో దర్శకుడు అరుణ్ గోపీ స్పందించారు. ఆ వార్తలో నిజం లేదని, సెప్టెంబర్ 28న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే జనాల్లో దిలీప్ నేరం చేశాడని తీవ్రవ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో రామ్ లీల ఎంతమేర విజయం సాధిస్తుందన్నది అనుమానమే. ఇక దిలీప్ కు బెయిల్ లభిస్తే సినిమా ప్రమోషన్లలో పాల్గొనే అవకాశముంది. మహిళా సంఘాలు మాత్రం రామ్ లీలాను అడ్డుకుని తీరతామని చెబుతున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన రామ్ లీలా చిత్రంలో ప్రయాగ రోజ్ మార్టిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటి రాధిక ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles